Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Dinesk Karthik: పడి లేచిన కెరటం.. బెస్ట్ ఫ్రెండ్ దారుణ మోసం!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఐపీఎల్‌కు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌తో రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఈ సీజన్ ముందే తన నిర్ణయాన్ని వెల్లడించిన దినేశ్ కార్తీక్.. ఐపీఎల్‌లో ఆర్‌సీబీతో పాటు కేకేఆర్, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.

మొత్తం 257 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన దినేశ్ కార్తీక్ 26.32 సగటు, 135 స్ట్రైక్‌రేటుతో 4,842 పరుగులు చేశాడు. ఇందులో 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆర్‌సీబీ తరఫున 162 స్ట్రైక్‌రేటుతో 937 పరుగులు చేశాడు. ఫినిషర్‌గా సత్తా చాటిన డీకే 82 ఫోర్లు, 53 సిక్సర్లు సాధించాడు.

How Dinesh Karthik was cheated by his best friend Murali Vijay

డీకే జీవితం స్ఫూర్తి దాయకం..
ఇక దినేశ్ కార్తీక్ జీవితం ప్రతీ ఒక్కరికి స్ఫూర్తి దాయకం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దినేశ్ కార్తీక్ రీఎంట్రీ ఇచ్చినట్లు ప్రపంచంలో మరే క్రికెటర్ కూడా కమ్ బ్యాక్ ఇవ్వలేదు. ధోనీ రాకతో టీమిండియా అవకాశాలు సన్నగిల్లగా.. వ్యక్తిగత జీవితంలో కట్టుకున్న భార్య, ప్రాణ స్నేహితుడు దారుణంగా మోసం చేశారు.

దాంతో అతను పిచ్చోడిలా మారిపోయాడు. అయితే దీపిక్ పల్లికల్ అందించిన ప్రేమ అతన్న బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేసింది. దినేశ్ కార్తీక్ టీమిండియా సెకండ్ వికెట్ కీపర్‌గా తమిళనాడు కెప్టెన్‌గా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న ‌టైమ్‌లో అతని టీమ్‌మేట్ మురళీ విజయ్.. కార్తీక్ మొదటి భార్యతో ఎఫైర్ పెట్టుకున్నాడు.

How Dinesh Karthik was cheated by his best friend Murali Vijay

ప్రాణ స్నేహితుడి మోసం..
ఈ విషయం కార్తీక్‌కు తప్పా తమిళనాడు టీమ్ మొత్తానికి తెలుసు. ఒకరోజు అతని మొదటి భార్య ఈ విషయాన్ని కార్తీక్‌కు తెలియజేసింది. మురళీ విజయ్ కారణంగా గర్భం దాల్చినట్లు చెప్పి విడాకులు ఇవ్వాలని కోరింది. విడాకులు తీసుకున్న ఆమె మురళీ విజయ్‌తో సహజీవనం మొదలుపెట్టింది. ఆ టైమ్‌లో విజయ్.. సీఎస్‌కే, టీమిండియా ఓపెనర్‌గా రాణిస్తున్నాడు.

ఈ ఊహించని పరిణామంతో దినేశ్ కార్తీక్ డిప్రెషన్‌కు లోనయ్యాడు. అతని ప్రదర్శన కూడా దెబ్బతిన్నది. టీమిండియాలో చోటుతో పాటు తమిళనాడు కెప్టెన్సీ బాధ్యతలను కోల్పోయాడు. ఐపీఎల్‌లోనూ దారుణంగా విఫలమయ్యాడు. ఈ బాధలను భరించలేక ఆత్మహత్యాయత్నం చేశాడు. జిమ్‌కు వెళ్లడం మానేసాడు.

How Dinesh Karthik was cheated by his best friend Murali Vijay

పల్లికల్ పరిచయంతో..
ఈ విషయం తెలుసుకున్న దినేశ్ కార్తీక్ ట్రైనర్.. అతని ఇంటికెళ్లి వ్యక్తిగతంగా కలిసాడు. జీవితంపై ఆశలు పెంచి మళ్లీ ట్రైనింగ్ మొదలుపెట్టేలా చేసాడు. ట్రైనర్ సూచనలతో మళ్లీ జిమ్‌ చేయడం మొదలుపెట్టిన దినేశ్ కార్తీక్‌కు అక్కడే ట్రైనింగ్ తీసుకుంటున్న భారత స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ పరిచయమైంది.

దినేశ్ కార్తీక్‌ కథను తెలుసుకొని పల్లికల్ చలించిపోయింది. ట్రైనర్‌తో కలిసి అతనికి కౌన్సిలింగ్ ఇవ్వడం మొదలుపెట్టింది. పల్లికల్ పరిచయం కార్తీక్ జీవితానికి ఊపిరి అయింది. దినేశ్ కార్తీక్‌ను దీపికా ఎంకరేజ్ చేయడంతో నెట్స్‌లో తీవ్రంగా శ్రమించిన అతను.. డొమెస్టిక్ మ్యాచ్‌ల్లో సత్తా చాటాడు. భారత జట్టుకు ఎంపికవ్వడంతో పాటు కేకేఆర్ కెప్టెన్సీ అందుకున్నాడు.

కవల పిల్లలతో..
దీపికా పల్లికల్‌ను పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకు టీమిండియాలో అతని స్థానాన్ని రిషభ్ పంత్ భర్తీ చేసాడు. మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. 34 ఏళ్ల వయసులో అతని కెరీర్ చివరి దశకు చేరిందని భావించిన కార్తీక్.. కేకేఆర్ కెప్టెన్సీ వదిలేసాడు. రిటైర్మెంట్ ప్రకటించి కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడాలనుకున్నాడు. కానీ పల్లికల్ అప్పటికే గర్భవతి. మధ్యలో కామెంటేటర్‌గా అవతారమెత్తాడు. ఈ జంటకు కవల పిల్లలు జన్మించారు.

దినేశ్ కార్తీక్‌కు సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథ్ నుంచి కాల్ వచ్చింది. ధోనీ వారసుడిగా తీసుకోవాలనుకుంటున్నామని ఆయన కార్తీక్‌కు తెలిపాడు. అయితే వేలంలో అనూహ్యంగా చెన్నైతో పోటీపడ్డ ఆర్‌సీబీ కార్తీక్‌ను సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో కార్తీక్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ఫినిషర్‌గా కార్తీక్ 2.oను తలపించాడు. ఈ ప్రదర్శనతో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన టీ20 ప్రపంచకప్ 2022 ఆడాడు. గత సీజన్‌లో కార్తీక్ విఫలమైనా ఈ సీజన్‌లో సత్తా చాటాడు.

Story first published: Thursday, May 23, 2024, 17:41 [IST]
Other articles published on May 23, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+