Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Akaay Kohli: అయ్యను మించిన కొడుకు.. రికార్డ్ సృష్టించిన కోహ్లీ తనయుడు!

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తనయుడు అకాయ్ కోహ్లీ సరికొత్త రికార్డ్ సాధించాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 15న జన్మించిన అకాయ్ కోహ్లీ.. తండ్రి బాటలోనే రికార్డుల మోత మోగిస్తున్నాడు. గూగుల్‌లో ఈ ఏడాది అర్థం కోసం ఎక్కువ వెతికిన రెండో పదంగా 'అకాయ్' నిలిచింది.

అకామ్ అర్థం తెలుసుకునేందుకు ఈ ఏడాది నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేశారు. విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ‌లు తమకు కొడుకు పుట్టాడని, అతనికి అకాయ్ అని పేరు పెట్టుకున్నామని ప్రకటించగానే.. ఆ పదం అర్థం కోసం నెటిజన్లు వెతకడం మొదలు పెట్టారని గూగుల్ పేర్కొంది.

How did Virat Kohli s son Akaay makes it to Google s Year in Search 2024 list


కాయ అనే హిందీ పదం నుంచి అకాయ్ వ‌చ్చిన‌ట్లు అప్పట్లో భాషా నిపుణులు పేర్కొన్నారు. కాయ్‌ అంటే కాయం. అంటే శ‌రీరం అని అర్థం. అకాయ్ అంటే పుష్టిక‌ర‌మైన శ‌రీరం క‌ల‌వాడ‌ని అర్థం. ఇక ట‌ర్కిష్ భాష‌లో అకాయ్ అంటే మెరిసే చంద్రుడిని అర్థం.

ఈ ఏడాది అర్థం కోసం గూగుల్‌లో అత్యధికంగా వెతికిన పదంగా 'రఫాపైనే అందరి కళ్లు'అనే వర్డ్ నిలిచింది.

సర్వికల్ క్యాన్సెర్(Cervical Cancer), టవైఫ్(Tawaif), డెమ్యూర్(Demure) , పూకీ (Pookie), మోయే మోయే (Moye Moye),(Good Friday) గుడ్ ఫ్రైడే, స్టాంపెడ్ (Stampede), కాన్‌సిక్రేషన్(Consecration) పదాలు కూడా అర్థం కోసం అత్యధికంగా సెర్చ్ చేసిన జాబితాలో నిలిచాయి.

గూగుల్ ట్రెండ్స్ ప్రకారం అకాయ్ గురించి సెర్చ్ చేసిన పదాలు...
1. అకామ్ నేమ్ మీనింగ్

2. అకాయ్ హిందీ మీనింగ్

3. అకాయ్ మీనింగ్ ఇన్ హిందీ

4. అకాయ్ ఇన్ హిందీ

5. మీనింగ్ ఆఫ్ అకాయ్

భారత్‌లో అత్యధికంగా వెతికిన పదాల జాబితాలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) టాప్‌లో ఉండగా.. టీ20 ప్రపంచకప్, భారతీయ జనతా పార్టీ, ఎలెక్షన్ రిజల్ట్స్ 2024, ఒలింపిక్స్ 2024 టాప్‌లో నిలిచాయి.

ఇవికాకుండా ఎక్స్‌సెస్సివ్ హీట్, రతన్ టాటా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్స్, ప్రో కబడ్డీ లీగ్, ఇండియన్ సూపర్ లీగ్ పదాలు టాప్-10లో ఉన్నాయి.

Story first published: Wednesday, December 11, 2024, 16:41 [IST]
Other articles published on Dec 11, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+