The Hundred: ఘోర ఓటమి.. సన్‌రైజర్స్ హైదరాబాద్ లీడ్స్ ఫైనల్ చేరాలంటే..?
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ది హండ్రెడ్ లీగ్ తుది దశకు చేరుకుంది. నేడు(బుధవారం) జరిగే రెండు మ్యాచ్‌లతో లీగ్ దశకు తెరపడనుంది. టేబుల్ టాపర్‌గా నిలిచిన ట్రెంట్ రాకెట్స్ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించగా.. రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్న మాంచెస్టర్ సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ లీడ్స్ ఎలిమిటేర్ రేసులో నిలిచాయి. అయితే ఈ రెండు జట్ల భవితవ్యం నేడు జరిగే ఎంఐ లండన్, బర్మింగ్‌హామ్ ఫోనిక్స్ మధ్య జరిగే మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంది.
టోర్నీ ఫార్మాట్ ఏంటంటే..?
ది హండ్రెడ్ టోర్నీలో మొత్తం 8 జట్లు పోటీపడుతాయి. లీగ్ దశలో ప్రతి టీమ్ మిగతా జట్లతో మ్యాచ్‌లు ఆడుతుంది. లీగ్ దశ ముగిసే సమయానికి పాయింట్స్ టేబుల్‌లో టాప్-3లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. పాయింట్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తోంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్' మ్యాచ్ జరగనుండగా.. గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. ఓడిన జట్టు ఇంటిబాట పడుతుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ లీడ్స్ ఫైనల్ చేరాలంటే..?
మంగళవారం మాంచెస్టర్ సూపర్ జెయింట్స్‌తో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ లీడ్స్ 10 వికెట్ల తేడాతో ఓడి ఫైనల్ బెర్త్‌ను తృటిలో చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఉంటే సన్‌రైజర్స్ 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు మెరుగైన రన్‌రేట్‌తో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరేది. కానీ ఈ పరాజయం.. ఇప్పుడు ప్లే ఆఫ్స్ బెర్త్ అవకాశాలను సంక్లిష్టం చేసింది.
10 వికెట్ల తేడాతో గెలిచిన మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ సన్‌రైజర్స్ లీడ్స్‌ను వెనక్కినెట్టి రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ లీడ్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు ఎంఐ లండన్ ఆఖరి లీగ్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంది. ఈ మ్యాచ్‌లో ఎంఐ లండన్ భారీ విజయంతో మెరుగైన రన్‌రేట్ సాధిస్తే సన్‌రైజర్స్ ఇంటిబాట పడుతోంది.
ఎంఐ ఓడినా లేదా పేలవ రన్‌రేట్‌తో గెలిస్తేనే సన్‌రైజర్స్ లీడ్స్ ఎలిమినేటర్‌కు అర్హత సాధిస్తుంది. అప్పుడు ఎలిమినేటర్‌లో విజయం సాధిస్తేనే ఫైనల్ చేరుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
