Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: గుజరాత్‌పై ఘన విజయం.. రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే..?

ఐపీఎల్ 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తమ పరాజయాల పరంపరకు బ్రేక్ వేసింది. వరుసగా ఐదు పరాజయాల తర్వాత విజయాన్ని నమోదు చేసింది. గుజరాత్ టైటాన్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ(38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్లతో 101) విధ్వంసకర శతకంతో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. సూర్యవంశీ ధాటికి 210 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ 25 బంతులు మిగిలి ఉండగానే చేధించింది.

ఈ విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను వెనక్కి నెట్టి పాయింట్స్‌ టేబుల్‌లో 8వ స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ 3 విజయాలు మాత్రమే నమోదు చేసింది. ఏడింటిలో ఓటమిపాలైంది. ఇందులో 3 మ్యాచ్‌ల్లో విజయం ముంగిట బోల్తా పడింది. దాంతో ఆ జట్టు ప్లే ఆఫ్స్ సమీకరణం సంక్లిష్టంగా మారింది. అద్భుతం జరిగితే తప్పా ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరలేని పరిస్థితి నెలకొంది. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఇంకా 4 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. ఈ నాలుగు మ్యాచ్‌లకు నాలుగు గెలిచినా.. ప్లే ఆఫ్స్ చేరలేదు. ఎందుకంటే ప్లేఆఫ్స్ చేరాలంటే కనీసం 16 పాయింట్స్ కావాలి.

How Can RR Qualify For IPL 2025 Playoffs After Win Over Gujarat Titans

ప్లే ఆఫ్స్ చేరాలంటే..?
ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ ఖాతాలో 6 పాయింట్స్ ఉన్నాయి. చివరి నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచినా 8 పాయింట్స్ వస్తాయి. అప్పుడు 14 పాయింట్లు మాత్రమే ఆ జట్టు ఖాతాలో చేరుతాయి. ఈ పరిస్థితుల్లో ప్లే ఆఫ్స్ చేరాలంటే ఇతర జట్ల ఫలితాలు.. రన్‌రేట్‌పై ఆధారపడాల్సి ఉంటుంది. ప్లే ఆఫ్స్ చేరే టాప్-3 టీమ్స్ మినహా మిగతా జట్లు 14 పాయింట్స్‌లోపే పరిమితం కావాలి. అంతేకాకుండా రాజస్థాన్ రాయల్స్ కంటే తక్కువ రన్ రేట్ ఉండాలి. అలా జరిగితేనే రాజస్థాన్ రాయల్స్‌కు ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుంది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ రన్‌రేట్( -0.349) బాలేదు. తదుపరి మ్యాచ్‌ల్లో ఆ జట్టు విజయం సాధించడంతో పాటు రన్‌రేట్ మెరుగుపర్చుకోవాలి.

తదుపరి మ్యాచ్‌లు ఏంటంటే..?
రాజస్థాన్ రాయల్స్ తమ తదుపరి మ్యాచ్‌లను ముంబై ఇండియన్స్(మే 1), కేకేఆర్(మే 4), సీఎస్‌కే(మే 12), పంజాబ్ కింగ్స్(మే 16)న ఆడనుంది. వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసకర బ్యాటింగ్‌ను కొనసాగించడంతో పాటు ఇతర ఆటగాళ్లు రాణిస్తే.. రాజస్థాన్ రాయల్స్‌కు ఈ నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించడం పెద్ద విషయం కాదు.

Story first published: Tuesday, April 29, 2025, 12:20 [IST]
Other articles published on Apr 29, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+