Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final: బంగ్లాపై విజయం.. టీమిండియా బెర్త్ పదిలం.. మరో మూడు గెలిస్తే..!

How Can India Still Reach WTC 2023 Finals After seal the series against Bangladesh

హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో గెలుచుకోవడంతో భారత జట్టు వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్యుటీసీ) ఫైనల్‌ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది.

ప్రస్తుతం 58.93 విజయాల శాతంతో 99 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఆసీస్‌ తొలి స్థానంలో, సౌతాఫ్రికా మూడో స్థానంలో ఉన్నాయి. ఫైనల్‌కు చేరే క్రమంలో భారత్‌కు సఫారీల నుంచి గట్టి పోటీనే ఎదురుకానుంది. దీంతో రోహిత్‌ సేన ఆసీస్‌తో రాబోయే నాలుగు టెస్టుల సిరీస్‌ను 4-0తో గెలిస్తే ఢోకా ఉండదు.

ఆస్ట్రేలియా ఫైనల్ బెర్త్..

ఆస్ట్రేలియా ఫైనల్ బెర్త్..

అప్పుడు విజయాల శాతం 68.05గా ఉంటుంది కాబట్టి దక్షిణాఫ్రికా తమకు మిగిలిన 4 టెస్టులను గెలిచినా ఫైనల్‌కు చేరుకోదు. ఒకవేళ భారత్‌ 3-0తో సిరీస్‌ సాధించి అటు సఫారీలు తమకు మిగిలిన అన్ని టెస్టులను గెలిస్తే మనోళ్లకు అవకాశం ఉండదు. మరోవైపు ప్రస్తుతం సాతాఫ్రికాతో మిగిలిన రెండు టెస్టులను కనుక గెలిస్తే ఆసీస్‌ జట్టు డబ్ల్యుటీసీ ఫైనల్లో అడుగుపెడుతుంది. ఈ సిరీస్‌‌ను క్లీన్ స్వీప్ చేస్తే.. భారత్‌తో జరగనున్న 4 టెస్ట్‌ల సిరీస్‌తో సంబంధం లేకుండా ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. దాదాపు ఆస్ట్రేలియా ఫైనల్ బెర్త్ ఖరారు అయినట్లే.

సంక్లిష్టంగా సౌతాఫ్రికా..

సంక్లిష్టంగా సౌతాఫ్రికా..

తొలి టెస్ట్‌లో చిత్తయిన సౌతాఫ్రికా.. రెండో టెస్ట్‌లోనూ తడబడుతోంది. ఈ సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయితే సౌతాఫ్రికా ఫైనల్ అవకాశాలు గల్లంతవుతాయి. అప్పుడు సొంతగడ్డపై వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ గెలిచినా.. భారత్ విజయాలపై ఆధారపడాల్సి ఉంటుంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో నాలుగో స్థానంలో ఉన్న శ్రీలంక.. న్యూజిలాండ్ గడ్డపై శ్రీలంక 2 టెస్ట్‌ల సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ రెండు గెలిచినా... ఆ జట్టు ఫైనల్ చేరడం కష్టం.

పాకిస్థాన్ ఔట్..

పాకిస్థాన్ ఔట్..

డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో ఐదో స్థానంలో ఉన్న పాకిస్థాన్ దాదాపు ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను 0-3తో కోల్పోయిన పాక్ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. డబ్ల్యూటీసీ 2022-23 సైకిల్‌లో పాకిస్థాన్.. చివరగా సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌లు గెలిచినా ఆ జట్టు ఫైనల్ చేరలేని పరిస్థితి.

Story first published: Monday, December 26, 2022, 9:50 [IST]
Other articles published on Dec 26, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+