Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC 2023: వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే..?

 How Can India Still Reach WTC 2023 Finals After Australia seal the series against West Indies

హైదరాబాద్: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ 2023 ఫైనల్ రేసు రసవత్తరంగా మారింది. వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-0తో గెలిచి తమ అవకాశాలను మరింత పదిలం చేసుకుంది. తాజా సిరీస్ విజయంతో డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో ఆస్ట్రేలియా 75 శాతం విజయాలతో తమ అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఆ తర్వాత సౌతాఫ్రికా 60 శాతం విజయాలతో రెండో స్థానంలో ఉండగా.. శ్రీలంక 53.33 శాతం విజయాలతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇక భారత్ 52.08 విజయాల శాతంతో నాలుగో స్థానంలో ఉండగా.. 46.67 శాతంతో పాకిస్థాన్ ఐదో స్థానంలో ఉంది.

 భారత్ ఫైనల్ చేరాలంటే..?

భారత్ ఫైనల్ చేరాలంటే..?

కేవలం 52.08 శాతంతో మూడో స్థానంలో ఉన్న భారత జట్టు ఫైనల్ చేరాలంటే తమ తదుపరి సిరీస్‌ల్లో అన్ని మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది. డబ్ల్యూటీసీ 2022-23 సైకిల్‌లో టీమిండియా ఇంకా రెండు సిరీస్‌లు మాత్రమే ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్‌తో గురువారం నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 2-0తో వచ్చే ఏడాది సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ను 4-0తో గెలిస్తే.. టీమిండియా విజయాల శాతం 68.06గా నమోదు అవుతుంది. ఇదే జరిగితే మరే జట్టు ఫలితంతో సంబంధం లేకుండా టాప్-2 ప్లేస్‌లో నిలిచి ఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది. ఆస్ట్రేలియాపై 3-0తో సిరీస్ గెలిచినా 64.35 శాతంతో అవకాశం ఉంటుంది. ఈ 6 మ్యాచ్‌ల్లో ఒక్కటి, రెండు ఓడినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

ఆస్ట్రేలియా పరిస్థితి ఏంటంటే..?

ఆస్ట్రేలియా పరిస్థితి ఏంటంటే..?

సొంతగడ్డపై వెస్టిండీస్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను గెలిచిన ఆస్ట్రేలియా.. ఫైనల్ చేరాలంటే తమ తదుపరి మ్యాచ్‌ల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. డబ్ల్యూటీసీ 2023 సైకిల్‌లో ఆస్ట్రేలియా ఇంకా రెండు సిరీస్‌లు ఆడాల్సి ఉంది. సౌతాఫ్రికాతో సొంతగడ్డపై 3 టెస్ట్‌ల సిరీస్.. భారత్‌తో 4 టెస్ట్‌ల సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ ఏడు మ్యాచ్‌ల్లో 4 గెలిచినా ఆస్ట్రేలియా ఫైనల్ బెర్త్‌కు డోకా ఉండదు. కానీ అంతకంటే ఎక్కువ ఓడితే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆసీస్ సేఫ్‌సైడ్‌లోనే ఉంది. సొంతగడ్డపై సౌతాఫ్రికాతో గెలవడం ఆ జట్టుకు పెద్ద కష్టమేమి కాదు. కానీ భారత్‌ను వారి సొంతగడ్డపై ఓడించడమే ఆ జట్టుకు సవాల్‌తో కూడుకున్న పని.

సౌతాఫ్రికాకు టఫ్..

సౌతాఫ్రికాకు టఫ్..

ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న సౌతాఫ్రికా.. డబ్ల్యూటీసీ 2023 సైకిల్‌లో రెండు సిరీస్‌లు ఆడాల్సి ఉంది. ఆస్ట్రేలియాతో వారి సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల సిరీస్, సొంతగడ్డపై వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో డీకొనాల్సి ఉంది. ఈ ఐదు టెస్ట్‌లకు ఐదు గెలిస్తేనే.. ఫైనల్ చేరుతుంది. అలా కాకుండా ఒక్కటి ఓడితే భారత్ ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. రెండు కంటే ఎక్కువ ఓడితే మాత్రం ఫైనల్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది.

న్యూజిలాండ్ గడ్డపై శ్రీలంక 2 టెస్ట్‌ల సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ రెండు గెలిచినా... ఆ జట్టు ఫైనల్ చేరడం కష్టం.

పాకిస్థాన్ ఔట్..

పాకిస్థాన్ ఔట్..

డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో ఐదో స్థానంలో ఉన్న పాకిస్థాన్ దాదాపు ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు టెస్ట్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ ఓడిన పాకిస్థాన్.. రెండో టెస్ట్‌లోనూ ఓటమి దిశగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో ఓడితే పాకిస్థాన్ ఫైనల్ ఆశలు గల్లంతయినట్లే. ఈ మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ డబ్యూటీసీ 2023 సైకిల్ పాక్ మరో మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడుతుంది. ఇంగ్లండ్‌తో చివరి టెస్ట్‌తో పాటు సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. ఈ మూడు మ్యాచ్‌లు గెలిచినా ఆ జట్టు ఫైనల్ చేరలేదు.

Story first published: Sunday, December 11, 2022, 15:28 [IST]
Other articles published on Dec 11, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+