టీ20ల్లో సంచలనం.. నాలుగు ఓవర్లకు 4 మెయిడిన్!
హాంకాంగ్ బౌలర్, భారత సంతతికి చెందిన ఆయుష్ శుక్లా సరికొత్త చరిత్ర లిఖించాడు. టీ20 క్రికెట్‌లో నాలుగు ఓవర్లకు నాలుగు మెయిడిన్ చేసిన బౌలర్‌గా చరిత్రకెక్కాడు. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ ఆసియా క్వాలిఫైయర్‌లో భాగంగా మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆయూష్ ఈ ఫీట్ సాధించాడు.
తద్వారా టీ20 క్రికెట్‌లో ఈ ఫీట్ సాధించిన మూడో బౌలర్‌గా నిలిచాడు. అయితే ఈ అరుదైన ఘనతను అందుకున్న తొలి ఆసియా బౌలర్ మాత్రం ఆయుష్ శుక్లానే కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో వేసిన తొలి బంతికే వికెట్ అందుకున్న ఆయుష్ శుక్లా.. తర్వాత వేసిన 23 బంతులకు ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు.

గతంలో న్యూజిలాండ్ పేసర్ లాకీ ఫెర్గూసన్, కెనడా బౌలర్ సౌద్ బిన్ జఫర్ ఈ ఫీట్ సాధించాడు. టీ20 ప్రపంచకప్‌లో పపువా న్యూగినియాతో జరిగిన మ్యాచ్‌లో లాకీ ఫెర్గూసన్ ఈ ఘనతను అందుకున్నాడు. పనామాతో జరిగిన మ్యాచ్‌లో సౌద్ బిన్ ఈ రికార్డ్ సాధించాడు.
ముంబైలోని పల్గార్ జిల్లాకు చెందిన ఆయుష్ శుక్లా హాంకాంగ్‌కు వలస వెళ్లి అక్కడి టీమ్‌లో కీలక ప్లేయర్‌గా మారాడు. ఇప్పటి వరకు ఆ జట్టు తరఫున 34 మ్యాచ్‌లు ఆడిన ఆయుష్ శుక్లా 8.62 ఎకానమీతో 29 వికెట్లు పడగొట్టాడు. ఆసియాకప్ 2022లో టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ వికెట్ తీసాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications