Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒకే ఓవర్‌‌లో 30 పరుగులు.. స్టువర్ట్ బిన్నీ సంచలన బ్యాటింగ్!(వీడియో)

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ సంచలన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో యూఏఈతో శనివారం జరిగిన మ్యాచ్‌లో బిన్నీ 11 బంతుల్లోనే 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 44 పరుగులు చేశాడు. అయినా ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది.

ఆఖరి ఓవర్‌లో భారత్ విజయానికి 32 పరుగులు అవసరమవ్వగా.. స్టువర్ట్ బిన్నీ వరుసగా 4, వైడ్, 6, 6, 6, 6, 1 బాదాడు. ఆఖరి బంతికి క్విక్ డబుల్ తీసే ప్రయత్నంలో రనౌటయ్యాడు. దాంతో భారత్ ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. ప్రస్తుతం స్టువర్ట్ బిన్నీ బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Hong Kong Sixes Stuart Binny slams 30 runs in last over against UAE Video

మాజీ క్రికెటర్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో పూల్-సీలో భాగంగా భారత్.. యూఏఈతో తలపడింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 6 ఓవర్లలో 5 వికెట్లకు 130 పరుగులు చేసింది. ఖలిద్ షా(10 బంతుల్లో ఫోర్, 6 సిక్స్‌లతో 42), జహూర్ ఖాన్(11 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 37 నాటౌట్) రాణించారు. భారత్ బౌలర్లలో స్టువర్ట్ బిన్నీ(3/31)నే మూడు వికెట్లు తీసాడు. భరత్ చిప్లి, షెహ్‌బాజ్ నదీమ్‌‌కు ఓ వికెట్ దక్కింది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 6 ఓవర్లలో 4 వికెట్లకు 129 పరుగులే చేసింది. కెప్టెన్ రాబిన్ ఊతప్ప(10 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 43), స్టువర్ట్ బిన్నీ రాణించినా ఫలితం లేకపోయింది. యూఏఈ బౌలర్లలో అకిఫ్ రాజా, సంచిత్ శర్మ, ముహమ్మద్ జుహైబ్ తలో వికెట్ తీసారు.

ఈ టోర్నీలో భారత్‌కు ఇది వరుసగా రెండో పరాజయం. పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఆరు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన పాకిస్థాన్ ఆరు బంతులు మిగిలుండానే 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని సాధించింది.

ఏడేళ్ల తర్వాత మళ్లీ మొదలైన హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్ టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్-సీలో భారత్‌, పాకిస్థాన్‌తో పాటు యూఏఈ ఉంది. ఈ టోర్నీలో ప్రతి జట్టులో ఆరుగురు ప్లేయర్లే ఉంటారు. ఓ మ్యాచ్‌లో ప్రతి జట్టు ఆరు ఓవర్లు ఆడుతుంది.

Story first published: Saturday, November 2, 2024, 13:02 [IST]
Other articles published on Nov 2, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+