ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత జోరు కొనసాగుతోంది. ఇప్పటికే చైనా, జపాన్‌లపై విజయం సాధించిన భారత్.. తాజాగా కజకిస్థాన్‌ను చిత్తు చేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయని భారత్.. మూడో మ్యాచ్‌లో మాత్రం చెలరేగిపోయింది. బిహార్‌లోని రాజ్‌గిర్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 15-0తో కజకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత్ సూపర్-4కు దూసుకెళ్లింది.
భారత జట్టులో అభిషేక్(5వ, 8వ, 20వ, 59వ నిమిషాల్లో)నాలుగు గోల్స్ చేయగా.. సుఖ్‌జీత్ సింగ్(15, 32, 38వ నిమిషం), జుగ్‌రాజ్ సింగ్(24, 31, 47వ నిమిషాల్లో) చెరో మూడు గోల్స్ సాధించారు. హర్మన్‌ప్రీత్(26వ నిమిషం), అమిత్ రోహిదాస్(29వ నిమిషం), రాజిందర్ సింగ్(32వ నిమిషం), సంజయ్ సింగ్(54వ నిమిషం), దిల్‌ప్రీత్(55వ నిమిషం) చెరో గోల్ కొట్టారు. ఈ మ్యాచ్‌లో భారత్ సగటున 4 నిమిషాలకు ఓ గోల్ చేయడం విశేషం. గ్రూప్-ఏలో ఆడిన మూడు మ్యాచ్‌లకు మూడు గెలిచిన భారత్.. అగ్రస్థానంతో సూపర్-4కు అర్హత సాధించింది.

గ్రూప్-ఏ నుంచి రెండో స్థానంలో నిలిచిన చైనా సూపర్-4 బెర్త్‌ను దక్కించుకుంది. జపాన్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో చైనా 2-2తో డ్రా చేసుకుంది. ఈ రెండు జట్లూ సమాన పాయింట్స్ సాధించినప్పటికీ.. గోల్ తేడాతో పై చేయి సాధించిన చైనా సూపర్-4 బెర్తును చేజిక్కించుకుంది.