WTC Final:యుద్ధం గెలవకపోతే..ఎంత మందిని ఓడించినా లాభంలేదు!టీమిండియా అంతే!ఒక్క సెషన్‌తో అంతాపాయే!

ముంబై: యుద్ధం గెలవకపోతే.. ఎంత మందిని ఓడించినా లాభంలేదని టీమిండియా మాజీ క్రికెటర్, స్టార్ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఓడిపోయిన ఆ ఒక్క గంటనే చరిత్ర గుర్తుంచుకుంటుందన్నాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ టైటిల్ కోసం కోహ్లీసేన రెండేళ్లుగా పడిన కష్టం, సాధించిన విజయాలు ఒక్క సెషన్‌తో కనుమరుగయ్యాయని ఆకాశ్ పేర్కొన్నాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్‌లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించి ప్రపంచ విజేతగా ఆవిర్భవించిన విషయం తెలిసిందే. ఒక్కసారి ఛాంపియన్స్ ట్రోఫీ (2000)ని సొంతం చేసుకోవడం మినహా ఐసీసీ టోర్నీల్లో గెలిచిన రికార్డు లేని కివీస్ జట్టు.. సుదీర్ఘ నిరీక్షణకు ఈ విజయంతో ముగింపు పలికింది.

ఆ ఒక్క గంటనే చరిత్ర గుర్తుంచుకుంటుంది
ఈఎస్‌పీఎన్-క్రిక్‌ఇన్ఫోకు రాసిన ఓ కాలమ్‌లో ఆకాశ్ చోప్రా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో భారత జట్టు ఓటమిపై స్పందించాడు. 'గెలుచుకున్న ట్రోఫీల ఆధారంగానే జట్లు మరియు కెప్టెన్ల పేరుప్రఖ్యాతలు చరిత్రలో నిలబడుతాయి. యుద్ధం గెలవకపోతే ఎంత మందిని ఓడించినా లాభంలేదు. రిజర్వ్‌డే రోజు ఎలాగైనా ఫలితం సాధించాలనే పట్టుదలతో భారత్ ఆటను ప్రారంభించి ఉండొచ్చు.
అయితే తొలి గంటలో విరాట్ కోహ్లీ, చెతేశ్వర్ పుజారా ఔటవ్వడంతో మ్యాచ్‌పై పట్టుకోల్పోయింది. ఇదే భారత జట్టు గత ఐదేళ్లుగా టెస్టు ర్యాంకింగ్స్‌లో వరుసగా టాప్‌లో నిలుస్తూ వచ్చింది. కానీ దురదృష్టం కొద్దీ సరిగ్గా ఆడలేకపోయిన ఆ ఒక్క గంటనే చరిత్ర గుర్తుంచుకుంటుంది' అని ఆకాశ్ అన్నాడు.

రిజర్వ్‌డే ముంచింది
భారత్ గత రెండేళ్లుగా ఛాంపియన్‌షిప్ పోటీల్లో కివీస్‌తో మినహా అన్ని జట్లపైనా వరుస విజయాలు సాధించింది. ఈ క్రమంలోనే పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచి.. చివరికి అదే న్యూజిలాండ్‌తో తుది పోరులో తలపడాల్సి వచ్చింది. వర్షం అంతరాయంతో ప్రతికూల పరిస్థితుల్లో కోహ్లీసేన ఆడింది. చివరి రోజు వరకూ ఫలితం ఇరు జట్లకు సమానంగా ఉంది. అయితే రిజర్వ్‌డే రోజు కోహ్లీ, పుజారా ఔటయ్యాక భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే కుప్పకూలింది.
ఇక తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన 32 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని న్యూజిలాండ్ 138 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. విలియమ్సన్ (52), టేలర్ (47) నాటౌట్‌గా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చారు.
అయ్యో.. 'మో ఫరా' ఎంతపనాయే! 4 సార్లు చాంపియన్ సెకండ్ల వ్యవధిలో మిస్!!

న్యూజిలాండ్‌తో మినహా
ఛాంపియన్‌షిప్‌లో భాగంగా భారత్ అద్భుత విజయాలు అందుకుంది. గతేడాది న్యూజిలాండ్‌తో మినహా మిగిలిన అన్ని సిరీస్‌ల్లోనూ విజయాలు సాధించింది. నాలుగో సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో భారత్ ఆడింది. 2020 ప్రారంభంలో కోహ్లీసేన కివీస్ పర్యటనకు వెళ్లగా.. అక్కడ ఆడిన రెండు టెస్టుల్లోనూ ఘోర ఓటములను ఎదుర్కొంది. దాంతో ఛాంపియన్‌షిప్ పోటీల్లో తొలిసారి టీమిండియాకు ఎదురు దెబ్బ తగిలింది.
కివీస్ బౌలర్ల ధాటికి పరుగులు చేయలేక బ్యాట్స్‌మెన్ పెవిలియన్ బాట పట్టారు. బౌలర్లు కూడా ప్రభావం చూపకపోవడంతో.. కివీస్ సునాయాస విజయాలు అందుకుంది. తొలి మ్యాచ్‌ను 10 వికెట్ల తేడాతో కైవసం చేసుకున్న కివీస్.. రెండో టెస్టును ఏడు వికెట్లతో సొంతం చేసుకుంది. మయాంక్ (58), షా(54), పుజారా (54), విహారి (55) ఒక్కో ఇన్నింగ్స్‌లలో రాణించారు. చివరకు ఫైనల్లో కూడా అదే జట్టుపై భారత్ పరాజయం పాలైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications