For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తిలక్ వర్మ.. ఈ పేరు చానా ఏండ్లు యాదుంటది!

నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. పహల్గాం ఉగ్రదాడిలో భారతీయ వనితల తిలకాన్ని పాక్ ఉగ్రమూక తుడిచేస్తే..ఆసియా కప్ 2025 టోర్నీ ఫైనల్లో అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో ఈ తెలుగు తేజం భారత్‌కు విజయ తిలకాన్ని దిద్దాడు. ఈ ప్రదర్శనతో అతని పేరు క్రికెట్ అభిమానులకు చానా ఏండ్లు యాదుండనుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఓటమి తప్పదనుకున్న పరిస్థితుల్లో నేనున్నానంటూ తిలక్ నిలబడ్డాడు.

టోర్నీ ఆసాంతం విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన అభిషేక్ శర్మ కీలక పోరులో చేతులెత్తేసినా.. శుభ్‌మన్ గిల్ నిరాశపర్చినా.. సూర్యకుమార్ యాదవ్ తన వైఫల్యాన్ని కొనసాగించినా.. తిలక్ నిలబడి గెలిపించాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తరహాలో ఒత్తిడిని అధిగమిస్తూ.. పాకిస్థాన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి చిరస్మరణీయ విజయాన్నందించాడు. 2022 టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ ఆడిన ది బెస్ట్ ఇన్నింగ్స్‌ను తిలక్ మరిపించాడు. నాటి కెప్టెన్‌ రోహిత్ శర్మ.. కోహ్లీ ఆటకు సలామ్ కొడితే.. నేటి కెప్టెన్ సూర్య.. తిలక్ వంగి వంగి దండాలు పెట్టాడు. ఆఖరి ఓవర్‌లో డీప్ స్క్వేర్ లెగ్ వైపు తిలక్ వర్మ కొట్టిన భారీ సిక్సర్ ఎప్పటికీ గుర్తిండిపోతుంది.

History Never Forgets Fans Hail Tilak Varma s Fighting Knock in Asia Cup 2025 Final Against Pakistan

దాదాపు 10 నెలల క్రితం సౌతాఫ్రికా గడ్డపై తిలక్ వర్మ వరుసగా రెండు టీ20ల్లో సెంచరీలతో చెలరేగాడు. ఆ తర్వాత భారత్‌కు రాగానే ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా మరో శతకం బాది.. టీ20 క్రికెట్‌లో వరుసగా మూడు సెంచరీలు బాదిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత చెన్నై వేదికగా ఇంగ్లండ్‌పై 72 పరుగులతో అజేయంగా నిలిచి సత్తా చాటాడు. కానీ ఐపీఎల్‌ 2025 సీజన్‌లో అతనికి అవమానకర స్థితి ఏర్పడింది. లక్నోతో మ్యాచ్‌లో ముంబై టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకున్న అనూహ్య నిర్ణయం తిలక్‌ను షాక్‌కు గురి చేసింది. 23 బంతుల్లో 25 పరుగులు చేయడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా రిటైర్డ్ ఔట్‌తో తిలక్‌ను బయటకు తీసుకొచ్చింది.

అయితే ఐపీఎల్ ప్రదర్శన అతని అంతర్జాతీయ కెరీర్‌పై ఏ మాత్రం ప్రభావం చూపించలేదు. గాయాల నుంచి కోలుకున్న తర్వాత జట్టులో అవకాశాన్ని అందుకున్న తిలక్.. తనదైన శైలిలో రాణించాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నా.. ఫైనల్లో ఆ ముచ్చట తీర్చుకొని సగర్వంగా నిలిచాడు. ఇప్పటి వరకు 32 అంతర్జాతీయ టీ20లు ఆడిన తిలక్.. 53.44 సగటుతో 962 పరుగులు చేశాడు. ఇందులో 2 శతకాలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 150 స్ట్రైక్‌రేట్‌తో దూసుకుపోతున్న తిలక్ వర్మ.. ఈ ఫార్మాట్‌లో మున్ముందు మరిన్ని సంచలన ప్రదర్శనలు చూపించడం ఖాయం. ఇదే జోరును కొనసాగిస్తే విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిగా తిలక్ నిలవనున్నాడు.

Story first published: Monday, September 29, 2025, 12:14 [IST]
Other articles published on Sep 29, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+