పాకిస్థాన్‌కు ఘోర పరాజయం.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్!
బంగ్లాదేశ్ పర్యటనను పాకిస్థాన్ ఘోర పరాజయంతో మొదలుపెట్టింది. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఢాకా వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో పాకిస్థాన్ 104 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. 268 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ 163 పరుగులకే కుప్పకూలింది.
అబ్దుల్లా ఫజల్(113 బంతుల్లో 11 ఫోర్లతో 66) మినహా అంతా విఫలమయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో నహిద్ రాణా(5/40) ఐదు వికెట్లతో పాకిస్థాన్ పతనాన్ని శాసించాడు. టస్కిన్ అహ్మద్(2/40), తైజుల్ ఇస్లామ్(2/22) రెండేసి వికెట్లు తీసారు. మెహ్‌దీ హసన్ మీరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు.
బంగ్లాదేశ్ ఆల్‌రౌండ్ ప్రదర్శన..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. తొలి ఇన్నింగ్స్‌లో 413 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో (101), మోమినుల్ హక్ (91), ముష్ఫికర్ రహీమ్ (71) రాణించారు. పాకిస్థాన్ బౌలింగ్‌లో మహ్మద్ అబ్బాస్(5/92) ఐదు వికెట్లు తీయగా.. షాహీన్ షా అఫ్రిది 3 వికెట్లు పడగొట్టాడు.

అనంతరం పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 386 పరుగులకు ఆలౌటైంది. ఇమామ్-ఉల్-హక్ (120), అబ్దుల్లా ఫజల్ (120) శతకాలతో రాణించారు. 27 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 240/9 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. నజ్ముల్ హుస్సేన్ షాంటో (87), మోమినుల్ హక్ (56) రాణించారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హోస్సేన్ షాంటో(101, 87)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.
చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్..
ఈ విజయంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్‌కు ఇది వరుసగా మూడో టెస్ట్ విజయం. 2024లో పాకిస్థాన్ వేదికగా జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌ను బంగ్లాదేశ్ 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఓ టీమ్‌పై బంగ్లాదేశ్ వరుసగా మూడు టెస్ట్ విజయాలు అందుకోవడం ఇదే తొలిసారి. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ శనివారం నుంచి ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications