అందుకే వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వలేదు: శ్రేయస్ అయ్యర్
రెండు టీ20ల సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కొత్తగా ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా నయా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి ఈ మ్యాచ్ ఆడే అవకాశం దక్కలేదన్నాడు. సమయం వచ్చినప్పుడు అతనికి ఖచ్చితంగా అవకాశం వస్తుందని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్లు, ఒక ఆల్‌రౌండర్‌తో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు.
వైభవ్‌కు నో ఛాన్స్..
'మేం ముందుగా ఫీల్డింగ్ చేయబోతున్నాం. బెల్ఫాస్ట్‌లో ఆడటం మాకు ఇదే తొలిసారి. ఇది మాకు కొత్త పిచ్. ఇక్కడి వాతావరణం, పరిస్థితులు, వికెట్‌ను దృష్టిలో ఉంచుకుని మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాం. ఆటగాళ్లందరినీ వారి సహజసిద్ధమైన ఆటను ఆడమని, పట్టుదలగా ముందుకు సాగమని మా కోచ్ చెప్పారు. దూకుడుగా ఆడాలన్నారు. ఇలా చెప్పడానికి నా దగ్గర చాలా పదాలు ఉన్నాయి. మేం వీలైనంత త్వరగా ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడాలి. మేం ఒక్కో మ్యాచ్‌పైనే దృష్టి పెడతాం.

విషయాలను మరీ క్లిష్టతరం చేసుకోవాల్సిన అవసరం లేదని నేను ఎప్పుడూ చెబుతుంటాను. దురదృష్టవశాత్తూ.. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఆడటం లేదు. సమయం వచ్చినప్పుడు అతనికి ఖచ్చితంగా అవకాశం వస్తుంది. ప్రస్తుతానికి మేం ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్లు, ఒక ఆల్‌రౌండర్‌తో బరిలోకి దిగుతున్నాం.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.
పంతం నెగ్గించుకున్న గంభీర్..
ఈ మ్యాచ్‌తోనే వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం ఉంటుందని భావించిన అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది. వైభవ్ సూర్యవంశీని ఆడించకుండా గంభీర్ తన పంతం నెగ్గించుకున్నాడని నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచినా అవకాశం ఇవ్వకపోతే ఎలా అని మండిపడుతున్నారు.
మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని ఐర్లాండ్ కెప్టెన్ టక్కర్ అన్నాడు. పిచ్ చూడటానికి చాలా బాగుందని, ప్రస్తుతం తమ జట్టు ట్రాన్సిషన్ ఫేజ్‌లో ఉందని తెలిపాడు. గత కొన్నేళ్లుగా స్టిర్లింగ్ జట్టును అద్భుతంగా నడిపించాడని, ఈ రోజు తమ జట్టు తరఫున జై మూంద్రా అరంగేట్రం చేస్తున్నాడని చెప్పాడు.
తుది జట్లు:
ఐర్లాండ్ : టిమ్ టెక్టర్, రాస్ అడైర్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్ (వికెట్ కీపర్/కెప్టెన్), బెంజమిన్ కాలిట్జ్, గారెత్ డెలానీ, జార్జ్ డోక్రెల్, లియామ్ మెక్‌కార్తీ, మాథ్యూ హంఫ్రీస్, జై మూంద్రా, మాథ్యూ హాలార్డ్.
ఇండియా: అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివం దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

