టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని క్లీన్ బౌల్డ్ చేసిన రైల్వేస్ పేసర్ హిమాన్షు సంగ్వాన్ రాత్రికి రాత్రే ఓవర్‌నైట్ స్టార్‌గా మారాడు. 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రంజీ ట్రోఫీ ఆడిన విరాట్ కోహ్లీకి హిమాన్షు సంగ్వాన్ పీడ కలను మిగిల్చాడు. అరుణ్ జైట్లీ మైదానం వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో హిమాన్షు సంగ్వాన్ స్టన్నింగ్ ఇన్‌స్వింగర్‌తో విరాట్ కోహ్లీని ఔట్ చేసిన విషయం తెలిసిందే.
సీనియర్ ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఆదేశించడంతో విరాట్ కోహ్లీ.. ఢిల్లీ తరఫున రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అరుణ్ జైట్లీ మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌కు ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

విరాట్ కోహ్లీని చూసేందుకు ఎగబడ్డారు. దాంతో ఈ రంజీ మ్యాచ్ అంతర్జాతీయ మ్యాచ్‌ను తలపించింది. కానీ కోహ్లీ మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. 15 బంతులు ఆడి ఓ బౌండరీ సాయంతో 6 పరుగులే చేసి హిమాన్షు సంగ్వాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అతను వేసిన ఇన్‌స్వింగర్.. కోహ్లీ బ్యాట్, ప్యాడ్ గ్యాప్ నుంచి దూసుకెళ్లి స్టంప్స్‌ను లేపేసింది.
రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీకి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఈ వికెట్‌తో హిమాన్షు సంగ్వాన్ అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే కోహ్లీని ఔట్ చేసేందుకు ఐదో స్టంప్ లైన్‌లో బంతులు వేయాలని తమ టీమ్ బస్ డ్రైవర్ చెప్పాడని తాజాగా ఓ ఇంటర్వ్యూలో హిమాన్షు సంగ్వాన్ చెప్పుకొచ్చాడు.
'ఈ మ్యాచ్‌కు ముందు ఢిల్లీ తరఫున విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ బరిలోకి దిగుతున్నారని వార్తలు వచ్చాయి. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేస్తారనే విషయం కూడా మాకు తెలియదు. ఆ తర్వాత నెమ్మదిగా రిషభ్ పంత్ ఆడటం లేదని, కోహ్లీ మాత్రం బరిలోకి దిగుతున్నాడని, ఈ మ్యాచ్ లైవ్ ఉందని ఒక్కొక్కటిగా తెలిసాయి. రైల్వేస్ పేస్ విభాగాన్ని నేనే నడిపిస్తున్నాను. దాంతో జట్టులోని ప్రతీ ఒక్కరు విరాట్ కోహ్లీని నేనే ఔట్ చేస్తానని అనుకున్నారు.
ఈ మ్యాచ్ కోసం మేం ప్రయాణించిన బస్సు డ్రైవర్ కూడా విరాట్ కోహ్లీ ఔటవ్వాలంటే నాలుగు, ఐదో స్టంప్ లైన్‌లో బౌలింగ్ చేయాలని సలహా ఇచ్చాడు. నాపై నాకు నమ్మకం ఉంది. నేను ప్రత్యర్థుల బలహీనతల కంటే నా బలాలపై మాత్రమే ఫోకస్ పెడుతాను. నేను బలాలకు తగ్గట్లు బౌలింగ్ చేసి వికెట్ సాధించాను.'అని హిమాన్షు సంగ్వాన్ తెలిపాడు.
అంతకుముందు ఈ వికెట్ తీసినందుకు కోహ్లీ తనను ప్రత్యేకంగా అభినందించాడని కూడా హిమాన్షు సంగ్వాన్ పేర్కొన్నాడు. 'ఆటోగ్రాఫ్ కోసం వికెట్ తీసిన బంతిని కోహ్లీకి ఇచ్చాను. వెంటనే ఆయన ఈ బంతితోనేనా నన్ను ఔట్ చేసింది? అని అడిగారు. అద్భుతమైన డెలివరీ అది. ఇలానే కష్టపడు. నీ భవిష్యత్తుకు బెస్ట్ విషెస్'అని తెలిపారు.
నా జీవితంలోనే ఇది అత్యంత ముఖ్యమైన వికెట్. విరాట్ కోహ్లీ దేశం మొత్తానికి స్పూర్తిదాయకం. ఓ రంజీ మ్యాచ్‌కు భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరవ్వడం చూడటం నా జీవితంలోనే తొలిసారి. ఇది మాకు చాలా ప్రత్యేకమైన మ్యాచ్.'అని హిమాన్షు సంగ్వాన్ చెప్పుకొచ్చాడు.