న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

DC vs SRH trolls: కేన్ మామ వచ్చాడు మ్యాచ్ గెలిపించాడు.. పంత్‌ నీ కథ ముగిసింది!

Hilarious memes and funny trolls from SRH vs DC game
IPL 2020,DC vs SRH : Sunrisers Hyderabad Fans Making Hilarious memes On Rishab Panth || Oneindia

అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు బోణీ కొట్టడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు మ్యాచ్‌ల్లో తీవ్రంగా నిరాశపరిచిన ఆరెంజ్ ఆర్మీ.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టి ప్రదర్శనతో చెలరేగి 15 పరుగులతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్‌లో రెండు మార్పులతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ఆశించిన ఫలితాన్ని రాబట్టింది. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ రెండు మ్యాచ్‌ల తర్వాత తుది జట్టులోకి రాగా.. జమ్మూ కశ్మీర్ క్రికెటర్ అబ్దుల్ సమాద్ ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ఈ ఇద్దరి రాకతో బ్యాటింగ్ లైనప్ బలంగా మారింది.

ముఖ్యంగా కేన్ విలియమ్సన్ (26 బంతుల్లో 5 ఫోర్లు 41) తన తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. దాంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రత్యర్థి ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం బౌలర్లు చెలరేగడంతో విజయాన్నందుకుంది. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ అభిమానులు విలియమ్సన్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కేన్ మామ వచ్చాడు..మ్యాచ్ గెలిచిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఢిల్లీ జట్టును గెలిపించలేకపోయిన రిషభ్ పంత్‌ను ట్రోల్ చేస్తున్నారు.

DC vs SRH: ఈ మూడు తప్పిదాలే ఢిల్లీ క్యాపిటల్స్ కొంప ముంచాయి!DC vs SRH: ఈ మూడు తప్పిదాలే ఢిల్లీ క్యాపిటల్స్ కొంప ముంచాయి!

కేన్ మామ నువ్వు సూపరో సూపర్..

కేన్ విలియమ్సన్ రాకతో జట్టు బలం రెట్టింపు అయిందని ఒకరంటే.. ‘నోకేన్ నో గెయిన్'అని మరొకరు కామెంట్ చేశారు. కేన్ మామ ఉంటే అంతే అని మరొకరు ట్వీట్ చేశారు. అలాగే కేన్ విలియమ్సన్‌ను కొనియాడుతూ ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఫిట్‌నెస్ సమస్యలతో మినహా మరే కారణంగా అతన్ని జట్టులో నుంచి తీసేయవద్దని హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా నువ్వు సూపర్ మామ అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పంత్ నీ కథ ముగిసింది..

ఈ మ్యాచ్‌లో రిషభ్ పంత్ (27 బంతుల్లో ఫోర్, 2 సిక్సర్లతో 28) విఫలమవడంతో అతనిపై వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. ఇప్పటికే వికెట్ కీపర్లు కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్‌లు తాజా సీజన్‌లో చెలరేగుతున్నారని, రిషభ్ పంత్ మాత్రం ఆ పోటీని మరిచిపోయి ఇలా పేలవంగా వికెట్లు చేజార్చుకుంటున్నాడని కామెంట్ చేస్తున్నారు. ఇలానే ఆడితే భారత జట్టులో చోటు దక్కడం కష్టమేనని, అంతర్జాతీయ కెరీర్‌కు శుభం కార్డు పడుతుందనే మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

సీఎస్‌కే‌పై సెటైర్స్

ఈ విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేరగా.. చెన్నై సూపర్ కింగ్స్ ఆఖరి స్థానానికి పడిపోయింది. దీంతో అభిమానులు వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. అయ్యయో ఎంతపనాయే.. సీఎస్‌కే లాస్ట్‌కు పడిపోవడమా? అని ఒకరంటే.. ఫిక్సింగ్ కుదురనట్టుందని ఇంకొకరు సెటైర్ వేశారు. సీఎస్‌కే అభిమానులంతా దిగాలుగా కూర్చున్నారని ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఇక చెన్నై మూడు మ్యాచ్‌ల్లో ఒకటి నెగ్గి రెండు ఓడిన విషయం తెలిసిందే.

ఆల్‌రౌండ్‌షో..

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 162 రన్స్ చేసింది. డేవిడ్ వార్నర్(33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45), బెయిర్ స్టో(48 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 53), కేన్ విలియమ్సన్(25 బంతుల్లో 5 ఫోర్లు 41) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో రబడా(2/21), అమిత్ మిశ్రా(2/35) రెండేసి వికెట్లు తీశారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 147 పరుగులకే పరిమితమైంది. శిఖర్ ధావన్(34), రిషభ్ పంత్(28), హెట్‌మైర్(21) మినహా అంతా విఫలమయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో రషీద్ మూడు వికెట్లు తీయగా.. భువీ 2, ఖలీల్, నటరాజన్ చెరొక వికెట్ దక్కించుకున్నారు.

Story first published: Wednesday, September 30, 2020, 10:32 [IST]
Other articles published on Sep 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X