న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

NZ Vs IND: భారత్-న్యూజిలాండ్‌ సిరీస్ వాయిదా.. కారణం ఏంటంటే?!

India, New Zealand ODI series postponed until T20 World Cup 2022

వెల్లింగ్టన్‌: భారత జట్టు న్యూజిలాండ్‌ పర్యటనను వాయిదా వేసుకుంది. న్యూజిలాండ్‌ గడ్డపై వచ్చే ఏడాది భారత్ మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. 2023 ప్రపంచకప్‌ సూపర్‌ లీగ్‌లో భాగంగా కోహ్లీసేన కివీస్‌తో మూడు వన్డేల్లో పాల్గొనాల్సి ఉండగా.. తాజగా ఆ సిరీస్ వాయిదా పడింది. అయితే ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌ 2022 ముగిసిన తర్వాత న్యూజిలాండ్‌లో వన్డే సిరీస్‌ ఆడేలా షెడ్యూల్‌ చేయనున్నట్లు కివీస్‌ క్రికెట్‌ బోర్డు అధికారి ఒకరు తెలిపారు. కరోనా వైరస్ క్వారంటైన్​ నిబంధనలు, వరుస ద్వైపాక్షిక సిరీస్​ల కారణంగా ఈ పర్యటన వాయిదా పడిందని సమాచారం తెలుస్తోంది.

న్యూజిలాండ్‌ వచ్చే ఏడాది ఏప్రిల్‌ వరకు ఫుల్ బిజీగా ఉండనుంది. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ ముగిసిన అనంతరం కివీస్ ప్లేయర్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2021 సెకండ్‌ ఫేజ్‌ ఆడేందుకు యూఏఈకి వెళ్లారు. అదే సమయంలో పాకిస్థాన్​ పర్యటన కూడా షెడ్యూల్ అయి ఉంది. ఆ వెంటనే యూఏఈలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ 2021లో పాల్గొనాల్సి ఉంది. ప్రపంచకప్‌ అనంతరం కివీస్‌ భారత్‌లో పర్యటించి రెండు టెస్టులు, మూడు టీ20 ఆడనుంది. దాంతో న్యూజిలాండ్‌ డిసెంబర్‌లో మళ్లీ స్వదేశానికి వస్తుంది. కివీస్ ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన కరోనా మార్గదర్శకాల ప్రకారం 14 రోజులు క్వారంటైన్‌లో గడపాల్సి ఉంది.

Ashes 2021: అది మా వ‌ల్ల కాదు.. యాషెస్ సిరీస్ ఎగ్గొట్టే ప్లాన్‌లో ఇంగ్లండ్‌!!Ashes 2021: అది మా వ‌ల్ల కాదు.. యాషెస్ సిరీస్ ఎగ్గొట్టే ప్లాన్‌లో ఇంగ్లండ్‌!!

మార్చి 4 నుంచి ఏప్రిల్‌ 3వరకు జరగనున్న మహిళల ప్రపంచకప్‌కు న్యూజిలాండ్‌ ఆతిథ్యమివ్వనుంది. ఈ గ్యాప్‌లో నెదర్లాండ్స్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లు న్యూజిలాండ్‌ పర్యటనకు రానున్నాయి. అందుకే వచ్చే ఏడాది ఆగస్టులో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ 2022 తర్వాత న్యూజిలాండ్‌తో భారత్ మూడు వన్డేలు ఆడేలా ప్లాన్‌ చేయనున్నారు. ఇక భారత్, న్యూజిలాండ్‌లు చివరిసారిగా జూన్‌లో జరిగిన ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌ మ్యాచ్‌ ఆడాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన కివీస్‌ తొలి చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను ఎగురేసుకుపోయింది.

భారత ఆటగాళ్లు గతేడాది నుంచి తీరిక లేని క్రికెట్ ఆడుతున్నారు. కరోనా వైరస్ కారణంగా గతేడాది ఏప్రిల్ మాసంలో మొదలవ్వాల్సి ఐపీఎల్ వాయిదా పడి అక్టోబర్-నవంబర్ మధ్య జరిగింది. అనంతరం సుదీర్ఘ ఆస్ట్రేలియా సిరీస్, ఇంగ్లండ్ సిరీస్, ఐపీఎల్ 2021ను టీమిండియా ప్లేయర్స్ ఆడారు. ఆపై టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్, శ్రీలంక సిరీస్, ఇంగ్లండ్ సిరీస్ ఆడారు. ఇక ఇప్పుడు ఐపీఎల్ 2021 ఆడనున్నారు. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్‌ 2021 ఉంది. దీంతో అందరూ ఏడాది పాటు క్వారంటైన్లోనే గడుపుతున్నారు. వచ్చే ఏడాది కూడా టీమిండియాకు బిజీ షెడ్యూల్ ఉంది.

Story first published: Thursday, September 16, 2021, 13:04 [IST]
Other articles published on Sep 16, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X