Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పందిలా ఉన్నాడు.. ఎలా ఆడిస్తున్నారు? సౌతాఫ్రికా కెప్టెన్‌పై మాజీ క్రికెటర్ ఫైర్!

సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తీవ్రంగా గాయపడ్డాడు. భారత్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో బవుమా తొడ కండరాల గాయంతో మైదానాన్ని వీడాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ 20వ ఓవర్‌లో విరాట్ కోహ్లీ ఆడిన షాట్‌ను ఆపే క్రమంలో బవుమా తొడ కండరాలు పట్టేసాయి. నొప్పితో విలవిలలాడిన అతను మైదానం వీడాడు. దాంతో కెరీర్‌లో చివరి టెస్ట్ సిరీస్ ఆడుతున్న డీన్ ఎల్గర్ తాత్కలిక సారథిగా జట్టును నడిపిస్తున్నాడు.

తొడ కండరాల గాయానికి గురైన బవుమాను ఆసుపత్రికి తరలించిన స్కానింగ్ తీయించగా.. ఎడమ తొడ కండరాల్లో నరం పట్టేసినట్లు తేలింది. అతను మ్యాచ్ ఆడే విషయాన్ని వైద్యులు నిర్దారిస్థారని క్రికెట్ సౌతాఫ్రికా ఎక్స్‌ వేదికగా వెల్లడించింది.

Herschelle Gibbs slam Temba Bavuma following his injury, calls him unfit and overweight

అయితే అన్‌ఫిట్‌గా ఉన్న బవుమాను సౌతాఫ్రికా తుది జట్టులోకి ఎలా తీసుకున్నారని హెర్షల్ గిబ్స్ ప్రశ్నించాడు. బవుమా అన్‌ఫిట్ ప్లేయరని, అధిక బరువతో బాధపడుతున్నాడని విమర్శలు గుప్పించాడు.

'2009లో సౌతాఫ్రికా ట్రైనర్‌గా ప్రారంభించి టీమ్ కోచ్‌గా మారిన వ్యక్తి అన్‌ఫిట్, అధిక బరువున్న ఆటగాళ్లను మ్యాచ్ ఆడటానికి అనుమతించడం హాస్యాస్పదంగా ఉంది.'అని హెర్షల్ గిబ్స్ ట్వీట్ చేశాడు. టెంబా బవుమా మైదానం వీడిన డీన్ ఎల్గర్ అద్భుతంగా జట్టును నడిపించాడు.

ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 59 ఓవర్లలో 8 వికెట్లకు 208 పరుగులు చేసింది. వర్షం కారణంగా చివరి సెషన్ ఆట సాధ్యం కాలేదు. వెలుతురు కూడా మందగించడంతో అంపైర్లు చివరి సెషన్ ఆటను రద్దు చేసి తొలి రోజును ముగించారు.

కేఎల్ రాహుల్(105 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 70 బ్యాటింగ్) విరోచిత ఇన్నింగ్స్‌‌కు అండగా విరాట్ కోహ్లీ(64 బంతుల్లో 5 ఫోర్లతో 38), శ్రేయస్ అయ్యర్(50 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 31), శార్దూల్ ఠాకూర్(33 బంతుల్లో 3 ఫోర్లతో 24) రాణించారు.

సౌతాఫ్రికా బౌలర్లలోకగిసో రబడా(5/44), నండ్రే బర్గర్(2/50)కు తోడుగా మార్కో జాన్సెన్ ఓ వికెట్ పడగొట్టాడు. కెప్టెన్ రోహిత్ శర్మ(5)తో పాటు యశస్వీ జైస్వాల్(17), శుభ్‌మన్ గిల్(2) తీవ్రంగా నిరాశపరిచారు.

Story first published: Tuesday, December 26, 2023, 22:39 [IST]
Other articles published on Dec 26, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+