ఎంత పెద్ద సెలెబ్రిటీలు అయినా.. కోటీశ్వరులైనా సంసార జీవితం సరిగ్గా లేకుంటే మానసిక ప్రశాంతతను కోల్పోతారు. టీమిండియా వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ గత కొన్నేళ్లుగా ఈ మానసిక క్షోభను అనుభవిస్తున్నాడు. తన మాజీ సతీమణి హసిన్ జహాన్ పెట్టిన టార్చర్‌కు ఓ సందర్భంలో ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్దమైనట్లు పలు ఇంటర్వ్యూల్లో షమీ చెప్పుకొచ్చాడు.
చివరకు ఆమెకు విడాకులు ఇచ్చి కెరీర్‌పై ఫోకస్ పెట్టిన షమీ.. ఇప్పటికీ ఆమె కారణంగా అనేక అవమానాలు, ఆరోపణలను ఎదుర్కొంటూనే ఉన్నాడు. కన్న కూతుర్ని కూడా కలుసుకోలేక.. మరో పెళ్లి చేసుకోలేక తీవ్ర బాధను అనుభవిస్తున్నాడు. తాజాగా మరో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ భార్య బాధితుడిగా మారినట్లు తెలుస్తోంది.

మద్యం మత్తులో చాహల్..
తన సతీమణి ధనశ్రీ వర్మతో చాహల్ విడాకులు తీసుకునేందుకు సిద్దమైనట్లు వార్తలు హల్‌ఛల్ చేస్తున్నాయి. ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం.. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చాహల్.. ధనశ్రీ ఫొటోలను తొలగించడం ఈ వార్తలకు బలం చేకూరింది. అంతేకాకుండా చాహల్ సన్నిహిత వర్గాలు విడాకుల విషయాన్ని ధ్రువీకరించాయని నేషనల్ మీడియా పేర్కొంది.
ఈ క్రమంలోనే యుజ్వేంద్ర చాహల్ మద్యం మత్తులో తూగుతూ ఉన్న ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో సోయి లేకుండా తాగిన చాహల్.. ఓ వ్యక్తి సాయంతో పబ్ నుంచి బయటకు వస్తూ తూగుతూ కారు ఎక్కాడు. ఫొటోలు, వీడియోలు తీస్తుండటం గమనించి తన ముఖానికి చేయి అడ్డుపెట్టుకున్నాడు.
సతీమణితో విడాకుల నేపథ్యంలో ఈ వీడియో బయటకు రావడంతో అందరూ అవాక్కయ్యారు. చాహల్‌ను అలా చూసిన నెటిజన్లు ఆవేదనకు గురయ్యారు. ప్రాణంగా ప్రేమిస్తే చివరికి ఇలానే అవుతుందని కామెంట్ చేస్తున్నారు.
నిజమిదే..?
అయితే మద్యం మత్తులో చాహల్ ఉన్న వీడియో పాతదని ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది. గతేడాది ఓ స్నేహితుడితో కలిసి పబ్‌కు వెళ్లిన చాహల్ అక్కడ ఫుల్‌గా తాగాడు. స్నేహితుడి సాయంతో కారు ఎక్కాడు. అప్పట్లోనే ఈ వీడియో వైరల్‌గా మారింది. కొందరు ఆకతాయిలు కావాలనే ఆ వీడియో తాజాగా వైరల్ చేశారు. ధనశ్రీ కారణంగానే చాహల్ ఇలా తయారయ్యాడని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ వీడియో పాతది అయినా.. చాహల్ పరిస్థితి ఇదేనని మరికొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
అయ్యర్‌తో ఎఫైర్..?
ధనశ్రీ వర్మను 2020లో యుజ్వేంద్ర చాహల్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ముంబైకి చెందిన డెంటిస్ట్, కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీ వర్మ వద్ద కరోనా లాక్ డౌన్ సమయంలో చాహల్ డ్యాన్స్ నేర్చుకున్నాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. నాలుగేళ్ల పాటు అన్యోన్యంగా ఉన్న ఈ జంట.. గత 6 నెలలుగా దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
గతంలో ధనశ్రీ వర్మ.. టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తో కలిసి పలు పార్టీలకు హాజరవ్వడం చర్చనీయాంశమైంది. శ్రేయస్ అయ్యర్‌తో ధన శ్రీ వర్మ సీక్రెట్ ఎఫైర్ నడిపిస్తుందని అప్పట్లో వార్తలు హల్‌చల్ చేశాయి. ధనశ్రీ విషయంలో చాహల్ జాగ్రత్తగా ఉండాలని అప్పట్లో ఫ్యాన్స్ అతన్ని హెచ్చరించారు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో యుజ్వేంద్ర చాహల్‌ను పంజాబ్ కింగ్స్ రూ. 18 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.