Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మహమ్మద్ షమీ-సానియా మీర్జా పెళ్లి ఫొటోలు వైరల్.. నిజమిదే..?

టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ, భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట ప్రత్యక్షమయ్యాయి.

పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో విడాకుల అనంతరం సానియా మీర్జా గురించి అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు మహమ్మద్ షమీ కూడా తన సతీమణి హసీన్ జహాన్‌కు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటున్నాడు. దాంతో సానియా మీర్జా, షమీ పెళ్లి చేసుకుంటున్నారని ప్రచారం మొదలు పెట్టిన కొందరు ఆకతాయిలు.. తాజాగా ఏఐ టెక్నాలజీ సాయంతో వారిద్దరికి పెళ్లి చేశారు. ఏఐ టెక్నాలజీతో రూపొందించి ఫేక్ పెళ్లి ఫొటోలను నెట్టింట వైరల్‌ చేశారు.

Here s The Truth Behind Viral Photo Of Sania Mirza And Mohammed Shami

తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలన్నీ ఫేక్. కొందరు కావాలనే ఏఐ సాయంతో వారిద్దరు పక్కపక్కనే ఉండే ఫొటోలనూ రూపొందించి వైరల్ చేశారు. సానియా మీర్జా-మహమ్మద్ షమీ పెళ్లి చేసుకోలేదు. ఇప్పటికే ఈ తరహా వార్తలపై ఈ ఇద్దరూ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు.

తన జీవితంలో విన్న అతి పెద్ద రూమర్ ఇదే అంటూ షమీ ఈ పుకార్లను కొట్టిపారేశాడు. మరోవైపు సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా కూడా ఘాటుగా స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసిన ఆయన.. పుకార్లు పుట్టించేవారిపై మండిపడ్డారు. అసలు ఇప్పటి వరకు తమ ఫ్యామిలీ సభ్యులు ఎవరూ షమీని కలవలేదని, అతనికి తమకు ఎలాంటి సంబంధం లేకున్నా ఈ పుకార్లు ఎలా వస్తున్నాయో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు.

సానియా మీర్జా- షోయబ్ మాలిక్ 2010లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పటికీ షోయ‌బ్‌కు అది రెండో వివాహం. తన తొలి భార్య అయేషా సిద్ధిఖితో విడాకుల అనంతరం సానియాను షోయబ్ పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇద్దరికి ఓ కొడుకు కూడా పుట్టాడు. పాకిస్థాన్ నటి సనా జావేద్‌తో షోయబ్ మాలిక్ సీక్రెట్ఎఫైర్ నడుపుతుండటంతో సానియా అతనికి విడాకులు ఇచ్చి స్వదేశం వచ్చేసింది. దాంతో సనా జావేద్‌ను షోయబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకున్నాడు.

Story first published: Monday, December 23, 2024, 18:59 [IST]
Other articles published on Dec 23, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+