క్రికెట్ ఆడడానికి మాత్రమే ఇక్కడకు వచ్చాం.. ఎంజాయ్ చేయడానికి కాదు: కోహ్లీ వార్నింగ్

దుబాయ్: క్రికెట్ ఆడడానికి మాత్రమే యూఏఈ వచ్చామని, ఎంజాయ్ చేయడానికి కాదని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లీ తన టీమ్‌మేట్స్‌ను హెచ్చరించాడు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బయో బబుల్‌ను సురక్షితంగా ఉంచేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్‌సీబీ ఆటగాళ్లకు సూచించాడు. టోర్నమెంట్ చివరి వరకు సజావుగా జరగాలంటే బయో బబుల్‌ను ఎప్పటికప్పుడు గౌరవించాల్సిన అవసరం అందరి బాధ్యత అని విరాట్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 13వ సీజన్ దుబాయ్, అబుదాబి, షార్జా వేదికల్లో సెప్టెంబర్ 19 నుంచి నవంబవర్ 10 వరకు జరగనుంది.

బయో బబుల్‌ను గౌరవించాలి:
ఆర్‌సీబీ యూట్యూబ్ షో బోల్డ్ డైరీస్‌లో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'జూమ్ కాల్‌లో నేను చెప్పింది ఎవరికీ ఒత్తిడి కలిగించిందని అనుకుంటున్నా. ప్రస్తుత పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. మనం ఇక్కడ క్రికెట్ ఆడడానికి వచ్చాం. మన పరిసరాలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఐపీఎల్ టోర్నమెంట్ చివరి వరకు సజావుగా జరగాలంటే.. బయో బబుల్‌ను ఎప్పటికప్పుడు గౌరవించాల్సిన అవసరం మనందరిపై ఉంది' అని టీమ్‌మేట్స్‌కు వార్నింగ్ ఇచ్చాడు.

క్రికెట్ ఆడడానికి వచ్చాం:
'మనం క్రికెట్ ఆడడానికి మాత్రమే యూఏఈ వచ్చాం. ఎంజాయ్ చేయడానికి కాదు. ఎంజాయ్ చేయడానికి ఇది సరైన సమయం అస్సలు కాదు. టోర్నీ ముందుకెళ్లే దిశగా మనం నడుచుకోవాలి. టోర్నీలో భాగం కావడానికి మనవంతు కృషి చేయాలి. ప్రతిఒక్కరు దానిని అర్థం చేసుకోవాలి' అని విరాట్ కోహ్లీ తన జట్టు ఆటగాళ్లకు సూచించారు. కరోనా వైరస్ కారణంగా తాను అనుకున్నంత ఆటను కోల్పోలేదని, ఐదు నెలల తర్వాత గాడిలో పడడానికి తనకు ఎక్కువ సమయం పట్టలేదన్నాడు. గత 10 సంవత్సరాలుగా పగలు మరియు రాత్రి క్రికెట్ ఆడుతున్నాను కాబట్టి ఈ విరామం తన ఆటపై అంతగా ప్రభావం చూపలేదని విరాట్ పేర్కొన్నాడు.

కాస్త భయపడ్డా:
దుబాయ్ వెళ్లి నిబంధనల ప్రకారం 6 రోజుల క్వారంటైన్ ముగించుకున్న బెంగళూరు జట్టు ఆదివారం నెట్స్‌లో చెమటోడ్చింది. విరాట్ కోహ్లీ సుదీర్ఘంగా బ్యాటింగ్ చేశాడు. 'నిజంగా చెబుతున్నా. తొలి బంతి ఆడే ముందు కాస్త భయపడిన మాట వాస్తవం. ఎందుకంటే గత ఐదు నెలలుగా నేను అసలు బ్యాటే పట్టలేదు. అయితే ప్రాక్టీస్ మాత్రం ఆశించినదానికంటే అద్భుతంగానే సాగింది' అని కోహ్లీ చెప్పాడు.

ఆ శబ్దం విని పదేళ్లయింది:
'ఈసారి బయో-బబుల్ ఆంక్షల కారణంగా మైదానంలో అభిమానులు ఉండరు. అభిమానులు లేకుండా ఆడడం మొదట వింతగా ఉంటుంది. కానీ టోర్నీ జరుగుతున్నా కొద్దీ చివరికి ఆటగాళ్లు అలవాటుపడిపోతారు. బంతిని బాదేటప్పుడు బ్యాట్ నుంచి వచ్చే శబ్దం విని 10 ఏళ్లు అయింది. రంజీ ట్రోఫీలో చివరిసారి ఆ అనుభూతిని అనుభవించా. ఇప్పడు ఆ అనుభూతిని మళ్లీ పొందే అవకాశం ఉంది. ఆరోగ్య భద్రతా ప్రోటోకాల్‌ల కారణంగా మైదానంలో వేడుకలు కూడా పరిమితం చేయబడతాయి. అందరూ వాటిని పాటించాల్సిన అవసరం ఎంతో ఉంది' అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.
మూడు ఫార్మాట్లలలో ఆవలింతలు తీసిన ఏకైక క్రికెటర్.. నెట్టింట్లో పేలుతున్న జోక్‌లు!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications