న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా చారిత్రక విజయంలో కీలక విషయాలివే..

Heres list of remarkable records Kohlis side broke en route to historic Adelaide win

అడిలైడ్‌: ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. 31 పరుగుల తేడాతో కోహ్లీ సేన గెలుపొంది సిరీస్‌ను విజయంతో ప్రారంభించింది. బౌలర్లు రాణించడంతో ఆసీస్‌ గడ్డపై టీమిండియా సిరీస్‌లో తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో 4 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌ సందర్భంగా నమోదైన గణాంకాలివీ..

ఆస్ట్రేలియాలో టెస్టు గెలవడం తొలిసారి

ఆస్ట్రేలియాలో టెస్టు గెలవడం తొలిసారి

2008 తర్వాత ఆసీస్‌ గడ్డపై టీమిండియా టెస్టు విజయాన్ని నమోదు చేసింది. రాహుల్‌ ద్రవిడ్‌, ధోని కెప్టెన్సీలో ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికాల్లో భారత్‌ టెస్టు మ్యాచ్‌లు గెలిచినప్పటికీ.. ఆస్ట్రేలియాలో మాత్రం గెలవలేదు. ఈ విజయం ద్వారా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికాల్లో జరిగిన టెస్టు మ్యాచ్‌లు గెలిపించిన ఒకే ఒక భారత కెప్టెన్‌‌గా విరాట్‌ కోహ్లీ నిలిచాడు.

తొలి టెస్టులో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న పంత్

టాస్‌తో కోహ్లీ.. వికెట్లతో అశ్విన్.. క్యాచ్‌లతో పంత్

టాస్‌తో కోహ్లీ.. వికెట్లతో అశ్విన్.. క్యాచ్‌లతో పంత్

కోహ్లీ టాస్‌ గెలిచిన టెస్టుల్లో ఇది 17వ విజయం. మొత్తం 20 టెస్టుల్లో టాస్‌ గెలవగా.. 3 డ్రా అయ్యాయి. ఈ మ్యాచ్‌ ద్వారా రిషబ్‌పంత్‌ అత్యధిక క్యాచ్‌లు(11) పట్టిన వికెట్‌కీపర్‌గా ప్రపంచ రికార్డును సమం చేశాడు. ఎక్కువ క్యాచ్‌లు నమోదైన టెస్టు కూడా ఇదే ఈ మ్యాచ్‌లో మొత్తం 35 క్యాచ్‌లు నమోదుకాగా.. ఇదే ఏడాది కేప్‌టౌన్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టెస్టులో 34 క్యాచ్‌లు నమోదయ్యాయి. అశ్విన్‌కు ఆస్ట్రేలియాలో ఇదే అత్యుత్తమం. ఈ టెస్టులో అశ్విన్‌ మొత్తం 6 వికెట్లు దక్కించుకున్నాడు.

తక్కువ పరుగుల తేడాతో మూడోసారి

తక్కువ పరుగుల తేడాతో మూడోసారి

తక్కువ పరుగుల తేడాతో భారత్‌ టెస్టు విజయాన్ని నమోదు చేసిన జాబితాలో ఈ మ్యాచ్‌ మూడోది. 2004లో భారత్‌ ఆస్ట్రేలియాపై 13 పరుగుల తేడాతో గెలుపొందగా.. 1973లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో భారత్‌ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు అడిలైడ్‌లో 31 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై నెగ్గింది.

1968 తర్వాత ఇదే తొలిసారి

1968 తర్వాత ఇదే తొలిసారి

ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో విదేశీ గడ్డపై 3 టెస్టు మ్యాచ్‌లు గెలవడం భారత్‌కు 1968 తర్వాత ఇదే తొలిసారి. ఆసీస్‌ పర్యటనలో సిరీస్‌లో తొలి టెస్టు గెలవడం భారత్‌కు ఇదే తొలిసారి. ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌ గెలిచిన రెండో ఆసియా జట్టు భారత్‌. గతంలో పాకిస్థాన్‌ మెల్‌బోర్న్‌లో తొలి టెస్టు గెలిచింది.

Story first published: Monday, December 10, 2018, 15:01 [IST]
Other articles published on Dec 10, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X