న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శిఖర్ ధావన్ ఫిట్.. రెండో టీ20లో కెప్టెన్ గబ్బరే! తుది జట్టు ఇదే!

Here Is The India Playing 11 After Shikhar Dhawan Is Out of Sri Lanka T20 Series
Ind Vs SL T20: Teamindia Batsmen నలుగురే.. తుడిజట్టు ఇదే | Oneindia Telugu

కొలంబో: భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించాలని చాలా మంది ప్లేయర్స్ కోరుకుంటారు. అందుకు ప్రతిభతో పాటు అదృష్టం కూడా ఉండాలి. ప్రతిభ ఉన్నా.. అదృష్టం కలిసిరాక వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ లాంటి వారు జట్టు పగ్గాలు అందుకోలేకపోయారు. అదృష్టంను జేబులో పెట్టుకుని వచ్చిన ఎంఎస్ ధోనీ కెరీర్ తొలినాళ్లలోనే కెప్టెన్‌ అయ్యాడు.

ఆపై విరాట్ కోహ్లీ బాధ్యతలు అందుకున్నాడు. అయితే ఒకేసారి రెండు పర్యటనలకు భారత్ వెళ్లడంతో.. అనుకోకుండా శిఖర్ ధావన్ కెప్టెన్ అయ్యాడు. అయితే కరోనా వైరస్ మహమ్మారి పుణ్యమాని పేసర్ భువనేశ్వర్ కుమార్ ఈ రోజు భారత జట్టు పగ్గాలు అందుకోనున్నాడని మొదటగా వార్తలు వచ్చాయి. తాజాగా గబ్బర్ ఫిట్‌గా ఉన్నాడని, రెండో టీ20లో కెప్టెన్ గబ్బరే అని వార్తలు వస్తున్నాయి. చూద్దాం మరి టాస్ వేసే సమయంలో అసలు విషయం తేలనుంది

కెప్టెన్‌గా భువనేశ్వర్

కెప్టెన్‌గా భువనేశ్వర్

శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టులో ఒక్కసారిగా కరోనా వైరస్ కలకలం రేపిన విషయం తెలిసిందే. టీమిండియా ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యాకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో అలజడి రేగింది. కొలంబో వేదికగా మంగళవారం శ్రీలంకతో జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు కృనాల్‌ గొంతులో ఇబ్బందిగా అనిపించడంతో.

అతడికి కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌ అని తేలింది. ఆ తర్వాత భారత బృందం మొత్తానికి ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు చేశారు. కృనాల్‌కు సమీపంగా మెలిగిన ఎనిమిది మంది ఆటగాళ్లకు నెగెటివ్‌ అని తేలినా.. అందరూ ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు. ఇందులో కెప్టెన్ శిఖర్ ధావన్ కూడా ఉన్నాడు. ధావన్ మిగతా టీ20ల నుంచి తప్పుకున్నాడు. దీంతో భువనేశ్వర్ కుమార్ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

ఐసోలేషన్‌లో 8 మంది

ఐసోలేషన్‌లో 8 మంది

పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, కృష్ణప్ప గౌతమ్, యుజ్వేంద్ర చహల్, శిఖర్ ధావన్, మనీష్ పాండేలు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు. కరోనా వైరస్ బారిన పడిన కృనాల్ పాండ్యాతో వీరందరూ సన్నిహితంగా మెలిగారు. ఈ ఎనమిది మందికి మంగళవారం, బుధవారం ఆర్టీ-పీసీఆర్ పరీక్షలను నిర్వహించగా నెగటివ్ వచ్చింది. ముందస్తు జాగ్రత్తలో భాగంగానే అందరూ ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు. దీంతో ఈరోజు రాత్రి జరగనున్న రెండో టీ20లో చాలా వరకు కొత్త కుర్రాళ్లు అరంగేట్రం చేయనున్నారు. దాదాపు ఐదుగురు కొత్తవారు జట్టులోకి రానున్నారు.

Nandu Natekar: బ్యాడ్మింటన్‌ దిగ్గజం నందు నటేకర్‌ మృతి.. అరుదైన ఘనతలు ఇవే!!

బ్యాట్స్‌మన్‌లు నలుగురే

బ్యాట్స్‌మన్‌లు నలుగురే

ఓపెనర్లుగా దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్ ఆడనున్నారు. మూడు, నాలుగు స్థానాల్లో సంజు శాంసన్, నితీష్ రాణాలు వస్తారు. ఈ నలుగురు తప్ప మిగిలిన వారందరూ బౌలేర్లే. దీపక్ చహార్, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, రాహుల్ చహర్, వరుణ్ చక్రవర్తి, నవదీప్ సైనీ, చేతన్ సకారియాలు రెండో టీ20 ఆడనున్నారు. దీపక్, భువనేశ్వర్ కాసేపు క్రీజులో నిలబడగల సామర్థ్యం ఉన్నవారే. ఇక మిగిలిన వారందరూ బ్యాటింగ్ చేయడం కష్టమే. టాప్-4 రాణిస్తేనే భారత్ స్కోర్ చేయగలదు. ఎం జరుగుతుందో చూడాలి.

తుది జట్టు

తుది జట్టు

దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ (కీపర్), నితీష్ రాణా, దీపక్ చహార్, భువనేశ్వర్ కుమార్ (కెప్టెన్), కుల్దీప్ యాదవ్, రాహుల్ చహర్, వరుణ్ చక్రవర్తి, నవదీప్ సైనీ, చేతన్ సకారియా.

Story first published: Wednesday, July 28, 2021, 17:22 [IST]
Other articles published on Jul 28, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X