Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్లాసెన్ అజేయ సెంచరీ.. తొలి వన్డేలో ఆస్ట్రేలియా చిత్తు

Heinrich Klaasen, bowlers propel South Africa to a series lead

పార్ల్‌: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో సౌతాఫ్రికా అద్బుత విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్‌లో హెన్రిచ్‌ క్లాసెన్‌ (114 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 123 నాటౌట్‌) అజేయ సెంచరీకి తోడు డేవిడ్‌ మిల్లర్‌ ( 70 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌‌తో 64) బాధ్యతాయుతంగా రాణించడంతో సఫారీ జట్టు 74 పరుగుల తేడాతో గెలుపొందింది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. క్లాసెన్, మిల్లర్‌ ఐదో వికెట్‌కు 149 పరుగులు జోడించి తమ జట్టు భారీ స్కోరు చేసేందుకు దోహదపడ్డారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్‌ రెండు, కమిన్స్‌ మూడు వికెట్లు తీశారు.

అనంతరం 292 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 45.1 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్‌ స్మిత్‌ (94 బంతుల్లో 3 ఫోర్లతో 76), లబ్‌షేన్‌ (51 బంతుల్లో 2 ఫోర్లతో 41 ) మినహా మిగతావారు విఫలమయ్యారు. సఫారీ బౌలర్లలో ఇన్‌గిడి (3/30), షమ్సీ (2/45) రాణించారు. కెరీర్‌లో తొలి సెంచరీ సాధించిన క్లాసెన్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌లో సౌతాఫ్రికా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే బుధవారం బ్లోమ్‌ఫోంటెన్‌లో జరుగుతుంది.

Story first published: Monday, March 2, 2020, 10:41 [IST]
Other articles published on Mar 2, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+