
వైద్య సేవకురిలిగా..
ఇక ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హెథర్ నైట్ మాత్రం మరో అడుగు ముందుకు వేసి సేవ మార్గాన్ని ఎంచుకుంది. తమ దేశ ‘జాతీయ ఆరోగ్య సేవా సంస్థ' (ఎన్‌హెచ్‌ఎస్)లో వలంటీర్‌గా సేవలందించేందుకు తన సభ్యత్వాన్ని నమోదు చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)లో ప్రాణాంతక వైరస్‌ను అరికట్టేందుకు నిరంతం శ్రమిస్తోన్న వైద్య వ్యవస్థకు తన సహాయాన్ని అందించనున్నట్లు 29 ఏళ్ల హెథర్ నైట్ పేర్కొంది.

ఎన్‌హెచ్‌ఎస్ వలంటీర్‌గా..
ఇందులో భాగంగా ఆమె చికిత్సకు అవసరమైన మందుల రవాణా చేయడంతోపాటు కరోనా వైరస్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించనుంది. ‘ఎన్‌హెచ్‌ఎస్ వలంటీర్ పథకంలో నేను చేరా. ప్రస్తుతం ఏ పనీ లేకుండా ఉన్నా. నా దగ్గర బోలెడంత ఖాళీ సమయం ఉంది. సాధ్యమైనంత వరకు సేవ చేస్తా. నా సోదరుడు, అతని భార్య ఇద్దరూ డాక్టర్లే. ఇంకా నాకు ఎన్‌హెచ్‌ఎస్‌లో పనిచేసే స్నేహితులు కూడా ఉన్నారు. ఈ కఠిన పరిస్థితుల్లో రోగుల కోసం వైద్యులు ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నా. అందుకే వారికి సహాయపడాలని ఈ నిర్ణయం తీసుకున్నా' అని ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్న హెథర్ నైట్ తెలిపింది.

వర్షంతో ఇంటికి..
ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన మహిళల టి20 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ వర్షం కారణంగా సెమీస్ ఆడకుండానే ఇంటిదారి పట్టింది. భారత్‌తో జరగాల్సిన ఆ మ్యాచ్ ఒక్క బంతి పడకుండా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో గ్రూప్ టాపర్ అయిన భారత్ ఫైనల్ చేరగా.. ఇంగ్లండ్ ఇంటిదారిపట్టింది. సెమీస్ మ్యాచ్‌కు రిజర్వ్ డే కేటాయించకపోవడంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

యూకేలో 14,543 కరోనా కేసులు..
ఈ మెగా టోర్నీ అనంతరం హెథర్ యూకే నిబంధనల ప్రకారం ఐసోలేషన్‌లోకి వెళ్లింది. ప్రస్తుతం యూకేలో 14,543కి పైగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో బుధవారం వలంటీర్ పథకాన్ని ప్రవేశపెట్టగా... 5 లక్షల మంది ఇందులో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు.


Click it and Unblock the Notifications












