
అసలేం జరిగిందంటే..
దీప్తి శర్మ వేసిన 14వ ఓవర్‌లో వరుస బంతుల్లో ఓపెనర్ బీమాంట్(59), కెప్టెన్ హీథర్‌నైట్(30) ఔటవ్వడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. బీమౌంట్ వికెట్ల ముందు దొరికిపోగా.. హీథర్ నైట్ విచిత్రకర రీతిలో రనౌట్‌గా వెనుదిరిగింది. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న హీథర్ నైట్ క్రీజు ధాటగా.. స్ట్రైకింగ్‌లో ఉన్న బ్యాటర్ ఆడిన బంతి నేరుగా దీప్తి శర్మ షూకు తగిలి వికెట్లపై పడింది. అప్పటికీ హీథర్ నైట్ క్రీజులో బ్యాట్ పెట్టకపోవడంతో భారత మహిళలు అప్పీలు చేశారు. అంపైర్ సమీక్ష కోరగా పలు కోణాల్లో పరిశీలించిన అంపైర్ ఔటిచ్చాడు.

వివాదాస్పదం..
అయితే అంపైర్ నిర్ణయంపై భిన్నవాదనలు తెరపైకి వచ్చాయి. కొందరు ఔటంటే మరికొందరు మాత్రం క్రీడా స్పూర్తికి ఇది విరుద్దమంటున్నారు. దీప్తి శర్మ హీథర్ నైట్‌కు అడ్డుగా వచ్చిందంటున్నారు. అయినా దీప్తి శర్మ రనౌట్ చేసే యాక్షన్‌లోనే లేదని, బంతినే ఆపేందుకు ప్రయత్నించిందని, అలాంటప్పుడు ఎలా ఔటిస్తారని కొందరు ప్రశిస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమె శరీరానికి తగిలే బంతి వికెట్లకు తాకింది కాబట్టి కచ్చితంగా ఔటేనని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చజరుగుతుంది.

షెఫాలి మెరుపులు..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళలు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 148 రన్స్ చేసింది. షెఫాలీ ధనాధన్ బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌కు అదిరిపోయే స్టార్ట్ ఇచ్చింది. స్మృతి మంధాన(20), షెఫాలీ వర్మ ఫస్ట్ వికెట్‌కు 70 రన్స్ భాగస్వామ్యం అందించారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(31)తో పాటు దీప్తీ శర్మ(24 నాటౌట్) రాణించారు.
ఇంగ్లిష్ బౌలర్లలో సివర్, డేవిస్, సారా గ్లెన్, మాడీ తలా ఓ వికెట్ తీశారు. అనంతరం చేజింగ్‌లో ఓవర్లన్నీ ఆడిన ఇంగ్లీష్ టీమ్ 8 వికెట్లు కోల్పోయి 140 రన్స్ చేసి ఓడింది. ఓపెనర్ బీమాంట్(59), కెప్టెన్ హీథర్‌నైట్(30) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్(2/17) రెండు వికెట్లు తీయగా.. దీప్తీ శర్మ, అరుందతీ రెడ్డిలకు తలో వికెట్ దక్కింది.


Click it and Unblock the Notifications












