
మొదటిసారి సారథ్య బాధ్యతలు:
ఐపీఎల్ 2019 సీజన్‌లో కెప్టెన్‌గా రవిచంద్రన్ అశ్విన్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్‌ని నడపించాడు. ఐపీఎల్ 2020 సీజన్‌కి అతడ్ని ఆ ఫ్రాంఛైజీ వదిలేసింది. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్‌కి అశ్విన్ బదిలీ రూపంలో వెళ్ళిపోయాడు. ఐపీఎల్‌లో గత రెండు సీజన్లుగా పంజాబ్ టీమ్‌కి ఆడుతున్న కేఎల్ రాహుల్.. టాప్ స్కోరర్లలో ఒకడిగా ఉన్నాడు. ఐపీఎల్ 2019 సీజన్‌లో 14 మ్యాచ్‌లాడిన రాహుల్.. 135.38 స్ట్రైక్‌రేట్‌తో 593 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక అశ్విన్ ఢిల్లీకి వెళ్లిపోవడంతో రాహుల్ సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు.

రాహుల్‌ని ఎంచుకోవడం కీలకమైన నిర్ణయం:
గత ఏడాది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్‌కి వికెట్ కీపర్‌గా వెస్టిండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ బాధ్యతలు నిర్వర్తించాడు. ఈ ఏడాది కూడా అతను జట్టులో ఉన్నాడు. కానీ కేఎల్ రాహుల్ తమ ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్ అని అనిల్ కుంబ్లే తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 'కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ని ఎంచుకోవడం చాలా కీలకమైన నిర్ణయం. నాకు రాహుల్ చాలా ఏళ్ల నుంచి తెలుసు. బెంగళూరుకి చెందిన అతను తొలిసారి ఐపీఎల్‌లో కెప్టెన్‌గా టీమ్‌ని నడిపించబోతున్నాడు' అని జంబో అన్నాడు.

వికెట్ కీపర్ రాహులే:
'కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్ గురించి నాకంటే ఎక్కువగా లోకేష్ రాహుల్‌కే తెలుసు. ఎందుకంటే.. గత రెండేళ్లుగా అతను టీమ్‌లో ఉన్నాడు. నా అంచనా ప్రకారం పంజాబ్ ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్ కేఎల్ రాహులే' అని అనిల్ కుంబ్లే వెల్లడించాడు. రాహుల్‌తో తనకు మంచి అనుబంధం ఉందని, నిర్ణయాలు తీసుకోవడంలో అది ఉపయోగపడుతుందని కుంబ్లే అన్నాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఇప్పటివరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా గెలవలేదు. ఈసారి కప్ ఎలాగైనా ఒడిసిపట్టాలని చూస్తోంది.


Click it and Unblock the Notifications

IPL 2020: బీసీసీఐ అధికారికి కరోనా!!










