Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అరరే! ఫ్లాట్ పిచ్‌లు లేక ఎంత పనైంది.. అభిషేక్ శర్మపై పేలుతున్న జోక్స్!

టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ పేలవ ఫామ్ కొనసాగుతోంది. సౌతాఫ్రికాతో ఆదివారం జరిగిన రెండో టీ20లోనూ అభిషేక్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. తొలి టీ20 తరహాలోనే 5 బంతుల్లో 4 పరుగులు చేసి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. గెరాల్డ్ కోయిట్జీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి అభిషేక్ శర్మ.. మూల్యం చెల్లించుకున్నాడు. కోయిట్జీ వేసిన షార్ట్ పిచ్ బాల్‌ను ఫైన్ లెగ్ మీదుగా అభిషేక్ శర్మ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి మార్కో జాన్సెన్ చేతిలో పడింది.

అభిషేక్ శర్మ వరుస వైఫల్యాల నేపథ్యంలో అతనిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా జుగుప్సాకరమైన రీతిలో ట్రోల్ చేస్తున్నారు. ఫన్నీ మీమ్స్‌తో నవ్వులు పూయిస్తున్నారు. గత 8 ఇన్నింగ్స్‌ల్లో0, 100, 10, 14, 16, 15, 4, 7, 4 అభిషేక్ శర్మ ఒకే ఒక్క సెంచరీ చేశాడని మండిపడుతున్నారు. అతని కంటే రుతురాజ్ గైక్వాడ్ మెరుగ్గా రాణిస్తున్నా.. అవకాశం ఇవ్వడం లేదని కామెంట్ చేస్తున్నారు.

He is missing flat tracks Abhishek Sharma brutally trolled after his another failure in T20Is

అభిషేక్ శర్మ ఫ్లాట్ వికెట్స్‌పై మాత్రమే ఆడుతాడని, కొంచెం బౌన్స్, స్వింగ్, స్పిన్ ఉన్నా అతను ఆడలేడని విమర్శిస్తున్నారు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబార్ ఆజామ్ తరహాలోనే ఫ్లాట్ వికెట్‌పై మాత్రమే ఆడుతాడని ట్రోల్ చేస్తున్నారు. దిగ్గజ బ్యాటర్ యువ రాజ్ సింగ్‌తో అభిషేక్ శర్మకు పోలికేంట్రా అని మండిపడుతున్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 124 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా(45 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 39 నాటౌట్), అక్షర్ పటేల్(21 బంతుల్లో 4 ఫోర్లతో 27) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయిట్జీ, అండిలే సిమెలెన్, ఎయిడెన్ మార్క్‌రమ్, పీటర్ తలో వికెట్ తీసారు.

టాపార్డర్ బ్యాటర్లు సంజూ శాంసన్(0), అభిషేక్ శర్మ(4), సూర్యకుమార్ యాదవ్ దారుణంగా విఫలమవ్వగా.. తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా పర్వలేదనిపించారు. కానీ భారీ స్కోర్లు చేయలేకపోయారు. దాంతో టీమిండియా స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది.

Story first published: Sunday, November 10, 2024, 22:31 [IST]
Other articles published on Nov 10, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+