వైభవ్ సూర్యవంశీ.. 16 ఏళ్ల సచిన్‌లా ఉన్నాడు: కపిల్ దేవ్
అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగుతున్న టీమిండియా టినేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ ప్రశంసల జల్లు కురిపించారు. అసాధారణ ప్రతిభ వైభవ్ సొంతమని కొనియాడారు. వైభవ్ సూర్యవంశీని చూస్తుంటే తనకు 16 ఏళ్ల సచిన్ గుర్తొస్తున్నాడని తెలిపారు. అయితే, వైభవ్ సూర్యవంశీకి అసలైన సవాలు ముందుందని అభిప్రాయపడ్డారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దాదాపు 37 ఏళ్ల తర్వాత ఇప్పుడు సచిన్ కంటే తక్కువ వయసులోనే టీమిండియా తరఫున ఆడేందుకు వైభవ్ సూర్యవంశీ సిద్దమయ్యాడు.
శుక్రవారం నుంచి ఐర్లాండ్‌తో ప్రారంభమయ్యే రెండు టెస్ట్‌ల సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో వైభవ్ శకం మొదలవ్వనుంది. ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన కపిల్ దేవ్.. 20 ఏళ్ల తర్వాతే వైభవ్ సూర్యవంశీ ఆటను జడ్జ్ చేయాలని అభిమానులు, క్రికెట్ విశ్లేషకులకు సూచించారు.

'వైభవ్ అసాధారణ ప్రతిభ కలిగిన ఆటగాడు. ప్రస్తుతం అతనిది చాలా చిన్న వయసు. 20 నుంచి 22 ఏళ్ల వయసు వచ్చాకే అతని అసలైన ప్రతిభను మనం అంచనా వేయగలం. 20 ఏళ్ల తర్వాతనే అతని ఆటను జడ్జ్ చేద్దాం. 16 ఏళ్ల వయసులో సచిన్ ఎలా ఉన్నాడో.. వైభవ్ కూడా అలాగే కనిపిస్తున్నాడు. కానీ, సచిన్‌లా సుదీర్ఘ కాలం పాటు ఆడగలడా? అనేది కాలమే నిర్ణయిస్తోంది. అతను ప్రయాణించాల్సిన దూరం ఇంకా చాలా ఉంది. వైభవ్ సూర్యవంశీతో పాటు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన జట్టు మొత్తానికి ఆల్ ది బెస్ట్.' అని కపిల్ దేవ్ చెప్పుకొచ్చారు.
ఇటీవల శ్రీలంకలో ముగిసిన ముక్కోణపు సిరీస్‌లో తొలి నాలుగు మ్యాచుల్లో విఫలమైన వైభవ్.. ఫైనల్లో మాత్రం విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది వరల్డ్ రికార్డ్ నమోదు చేసిన వైభవ్.. 29 బంతుల్లోనే 94 పరుగులు చేసి తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో 776 పరగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ ప్రదర్శనతో ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు.
శుక్రవారం జరిగే తొలి మ్యాచ్‌లోనే అతను బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే అతనికి సంజూ శాంసన్ రూపంలో గట్టి పోటీ ఉండనుంది. సీనియర్లకే ప్రాధాన్యత ఇస్తే మాత్రం వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితమవుతాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

