టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 'కెప్టెన్ కోహ్లీ ఈజ్ బ్యాక్'అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్‌లో విరాట్ కోహ్లీ తాత్కలిక సారథిగా టీమిండియాను నడిపిస్తున్నాడు.
ఈ మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తప్పుకోగా.. జస్‌ప్రీత్ బుమ్రా సారథిగా వ్యవహరిస్తున్నాడు. అయితే రెండో రోజు ఆట రెండో సెషన్‌లో ఒకే ఒక ఓవర్ బౌలింగ్ చేసిన బుమ్రా.. గాయంతో మధ్యలోనే మైదానం వీడాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్కానింగ్ కోసం బుమ్రాను ఆసుపత్రికి తీసుకెళ్లారు.

బుమ్రా మైదానం వీడటంతో సీనియర్ ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. బుమ్రా మైదానం వీడే సమయానికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 151/6తో ఉంది. క్రీజులో సెట్ అయిన వెబ్‌స్టర్‌తో పాటు ప్యాట్ కమిన్స్ ఉన్నాడు. బుమ్రా వైదొలగడంతో ఆసీస్ భారీ స్కోర్ చేస్తుందని అంతా అనుకున్నారు.
కానీ సారథ్య బాధ్యతలు అందుకున్న కోహ్లీ తనదైన శైలిలో బౌలింగ్ మార్పులు, ఫీల్డ్ సెటప్‌తో ఆసీస్‌ను 181 పరుగులకే కట్టడి చేశాడు. ప్రసిధ్ కృష్ణ, నితీష్ కుమార్ రెడ్డి, సిరాజ్‌ల సాయంతో ఆసీస్ బ్యాటర్లకు చెక్ పెట్టాడు. దాంతో భారత్‌కు 4 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.

దాంతో కోహ్లీ కెప్టెన్సీపై ఫ్యాన్స్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. టెస్ట్‌ల్లో విరాట్ కోహ్లీనే అత్యుత్తమ కెప్టెన్ అని కొనియాడుతున్నారు. 'అక్కడ ఉన్నది కోహ్లీ.. వికెట్ల కోసం అతనికి బుమ్రా అవసరం లేదు. ది గ్రేటెస్ట్ కెప్టెన్'అని కామెంట్ చేస్తున్నారు. గత మ్యాచ్‌లో రోహిత్ శర్మ.. ఆసీస్ ఆఖరి వికెట్ తీసేందుకు కూడా బుమ్రాపై ఆధారపడ్డాడు.
ఓ దశలో బుమ్రా బౌలింగ్ చేయలేనని కూడా రోహిత్‌కు చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వీడియోలను గుర్తు చేస్తూ కోహ్లీ కెప్టెన్సీని నెటిజన్లు కొనియాడుతున్నారు.
He is Kohli, he doesn’t need bumrah to get wickets. The greatest TEST CAPTAIN pic.twitter.com/ujp8IRbuga
— (@chixxsays) January 4, 2025
- Original Captain Sacked.
— M. (@Iconiic_Kohli) January 4, 2025
- Real Captain left the stadium.
- Australia looking comfortable
Then comes Mr Fix it 😭🔥pic.twitter.com/j0r4W2COmf
Australia were 162/6
— Kevin (@imkevin149) January 4, 2025
Australia got all out for 181
Never Ever Doubt captain Virat Kohli. I Repeat Never. pic.twitter.com/MMhdWGOQcL
Rohit dropped? Bumrah injured?
— 𝘿 (@DilipVK18) January 4, 2025
Don’t panic Captain Kohli is here to the rescue! pic.twitter.com/rl2jCqoxRz