For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: 'కేఎల్ రాహుల్ మరోసారి నిరూపించుకున్నాడు.. అతడి ముందున్న సవాల్‌ అదొక్కటే'

He is back for good: Aakash Chopra praises KL Rahuls batting in England

లండన్: టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌పై భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంగ్లండ్ పర్యటనలో రాహుల్‌ దొరికిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడన్నాడు. తన అద్భుత బ్యాటింగ్‌తోతనలోని నైపుణ్యాలను మరోసారి బయటపెట్టాడని ప్రశంసించాడు. రాహుల్ ఇదే ఫామ్‌ను సిరీస్‌ ఆసాంతం కొనసాగిస్తాడని ఆకాశ్ చోప్రా ఆశాభావం వ్యక్తం చేశాడు. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ 151 పరుగుల తేడాతో గెలిచినా విషయం తెలిసిందే. ఇక భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఆగష్టు 25 నుంచి లీడ్స్ వేదికగా మూడో టెస్ట్ ఆరంభం కానుంది.

84, 129 పరుగులు

84, 129 పరుగులు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2021 వాయిదా పడినప్పుడు లోకేష్ రాహుల్‌ అపెండిసైటిస్‌ శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దాని నుంచి త్వరగానే కోలుకున్నాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికయ్యాడు. అయితే అప్పటికి రాహుల్ ఓపెనర్ల జాబితాలో కనీసం రెండో స్థానంలోనూ లేడు. ఎప్పుడైతే ప్రధాన ఓపెనర్ల రేసులో ఉన్న శుభ్‌మన్‌ గిల్‌, మయాంక్‌ అగర్వాల్‌ గాయపడటంతో రాహుల్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ట్రెంట్‌ బ్రిడ్జ్‌లో 84 పరుగులు చేశాడు. ఇక లార్డ్స్‌ ఏకంగా 129 పరుగులు సాధించాడు. మొత్తం సిరీసులో 244 పరుగులతో అందరికన్నా ప్రస్తుతం ముందున్నాడు.

ఐదు సెంచరీలు చేయలేరు

ఐదు సెంచరీలు చేయలేరు

తాజాగా ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ... 'టాప్‌ ఆర్డర్‌లో లోకేష్ రాహుల్‌ రాణించగల సామర్థ్యంపై సందేహమే లేదు. ఎందుకంటే నైపుణ్యాలేమీ లేకుండా ఎవరూ కూడా ఐదు సెంచరీలు చేయలేరు. అందులో నాలుగు విదేశాల్లో చేసినవే (లార్డ్స్‌కు ముందు).

రాహుల్ ట్రెంట్‌ బ్రిడ్జ్‌ తొలి ఇన్నింగ్స్‌లో చేసిన 84 పరుగుల ఇన్నింగ్స్‌లో కొత్త బంతిని ఆడేటప్పుడు అతడి నైపుణ్యాలను ఎంతగా నమ్ముతున్నాడో అర్థమవుతోంది. ఇక లార్డ్స్‌లో సెంచరీతో అతడు పుంజుకున్నాడని అర్థమైంది. రాహుల్ బాగా ఆకట్టుకున్నాడు. మంచి భాగస్వామ్యాలు నెలకొల్పారు' అని అన్నాడు.

రెండో టెస్టుకు సిద్ధంగా ఉండమన్నారు.. అంతలోనే తప్పించారు! అనవసరంగా ఆశపడ్డాను: అశ్విన్

ముందున్న సవాల్‌ అదొక్కటే

ముందున్న సవాల్‌ అదొక్కటే

లార్డ్స్‌లో ఆఫ్‌సైడ్‌ బంతులకు ఔటవ్వకుండా ఉండేందుకు తొలి 100 బంతుల్లో లోకేష్ రాహుల్ 18 పరుగులే చేశాడు. ఆ తర్వాత బౌండరీలు బాదేశాడు. 'రాహుల్‌ దేహానికి దూరంగా వెళ్తున్న బంతుల్ని చక్కగా వదిలేస్తున్నాడు. అనువైన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆపై బౌండరీలు బాదేస్తున్నాడు. ప్రస్తుత ఫామ్‌ను మున్ముందు కొనసాగించడం అతడి ముందున్న సవాల్‌. టెస్ట్ సిరీస్ ఆసాంతం రాహుల్ అలరిస్తాడని నేను నమ్ముతున్నా. పరుగుల వరద పారిస్తాడు' అని ఆకాశ్‌ చోప్రా ధీమా వ్యక్తం చేశాడు. రాహుల్ భారత్ తరఫున 38 టెస్టు మ్యాచులు ఆడాడు. 6 సెంచరీలు, 12 అర్ధ శతకాలతో 2250 రన్స్ చేశాడు.

అత్యుత్తమ బౌలింగ్‌ లైనప్‌

అత్యుత్తమ బౌలింగ్‌ లైనప్‌

'ప్రస్తుతం టీమిండియాకున్న బౌలింగ్‌ లైనప్‌ భారత టెస్టు క్రికెట్‌లోనే అత్యుత్తమమైనది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మేం క్రికెట్ ఆడుతున్న సమయంలో అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్‌ లాంటి దిగ్గజ స్పిన్నర్లు ఉన్నప్పటికీ..నలుగురు లేదా ఐదుగురు ఫాస్ట్‌ బౌలర్లు లేరు. హర్భజన్‌, జహీర్‌ ఖాన్‌, కుంబ్లే వంటి బౌలర్లు జట్టు కోసం ఎన్నో అద్భుతాలు చేశారు.

కొంత కాలం జహీర్‌, అజిత్ అగార్కర్‌, ఆశిష్ నెహ్రా, ఆర్పీ సింగ్‌ వంటి బౌలర్లు రాణించినప్పటికీ.. ఇప్పుడు ఉన్న విధంగా బౌలింగ్‌ లైనప్‌ లేదు. ప్రస్తుతం బుమ్రా, షమీ, ఇషాంత్, సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌ వంటి బౌలర్లతో బౌలింగ్‌ దళం పటిష్టంగా ఉంది. స్పిన్నర్ల విషయానికొస్తే.. హర్భజన్‌ పాత్రను అశ్విన్‌ పోషిస్తున్నాడు. ఇక కుంబ్లే వంటి బౌలర్‌ జడేజా రూపంలో ఉన్నాడు. కాబట్టి భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఇంతకన్నా మెరుగైన బౌలింగ్‌ లైనప్‌ ఉందని అనుకోను' అని ఆకాశ్‌ చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, August 21, 2021, 11:35 [IST]
Other articles published on Aug 21, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+