For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ టీమిండియా ఆటగాడు దేవుడిచ్చిన వరం: అంబటి రాయుడు

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్‌లపై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రశంసల జల్లు కురిపించాడు. బుమ్రా టీమిండియాకు దేవుడిచ్చిన వరమని చెప్పిన రాయుడు... సూర్యకుమార్ యాదవ్ తన బ్యాటింగ్‌తో క్రికెటర్లందరికి పాఠాలు చెబుతున్నాడని
కొనియాడాడు.

టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. వరుసగా 4 మ్యాచ్‌ల్లో విజయా సాధించింది. ఈ నాలుగు మ్యాచ్‌ల్లో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన బుమ్రా.. దాయాదీ పాకిస్థాన్‌తో జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్‌లో 3 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ అందుకున్నాడు.

He Is A Gift By God Ambati Rayudu Praises Jasprit Bumrah Super Show For India In T20 World Cup 2024

అమెరికా జట్టుపై వికెట్లు తీయనప్పటికీ పొదుపుగా బౌలింగ్ చేశాడు. అఫ్గానిస్థాన్‌తో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో బుమ్రా నిప్పులు చెరిగాడు. 3 వికెట్లు పడొట్టి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా మొత్తం 8 వికెట్లు తీసాడు.

అఫ్గాన్‌తో మ్యాచ్‌లోనూ సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. టాపార్డర్ విఫలమైన వేళ కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 'బుమ్రా ఎప్పటిలాగే అద్భుతంగా రాణిస్తున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణించే సత్తా అతనికి ఉంది. బుమ్రా వరల్డ్ క్లాస్ పేసర్. భారత జట్టుకు దేవుడు ఇచ్చిన బహుమతి. భారత జట్టులో బుమ్రా ఉండటం భారతీయుల అదృష్టం.

సూర్యకుమార్ యాదవ్ కూడా అద్భుతంగా ఆడారు. బ్యాటర్లందరికీ తన బ్యాటింగ్‌తో పాఠాలు చెబుతున్నాడు. ముఖ్యంగా స్లో వికెట్‌పై ఎలా ఆడాలో చూపిస్తున్నాడు. అతను ఫుట్‌వర్క్‌ను బాగా ఉపయోగించుకుంటున్నాడు. వరల్డ్ క్లాస్ స్పిన్నర్లను క్రీజుకు రెండు మీటర్ల దూరం ఉండి ఆడుతున్నాడు.'అని అంబటి రాయుడు చెప్పుకొచ్చాడు.

సూపర్-8లో శుభారంభం చేసిన టీమిండియా.. మరికాసేపట్లో బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే టీమిండియా సెమీస్ బెర్త్ ఖరారు అవుతోంది. ఓడితే మాత్రం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది.

Story first published: Saturday, June 22, 2024, 18:22 [IST]
Other articles published on Jun 22, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+