నెక్ట్స్ కోహ్లీ అయ్యే సత్తా ఉంది: గిల్‌పై ట్విట్టర్‌లో ప్రశంసల జోరు

హైదరాబాద్: 'నెక్ట్స్ కోహ్లీ అయ్యే సత్తా అతడికే ఉంది' గురువారం రాత్రి చెన్నై-కోల్‌కతా జట్ల మధ్య మ్యాచ్ అనంతరం యువ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్‌ను ఉద్దేశించి ఓ నెటిజన్ చేసిన ట్వీట్ ఇది. గురువారం రాత్రి ఈడెన్ గార్డెన్స్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మాన్ గిల్ తన అద్భుత బ్యాటింగ్‌తో కోల్‌కతాను గెలిపించాడు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
కెప్టెన్ దినేశ్ కార్తీక్‌తో కలిసి దూకుడుగా ఆడిన గిల్.. విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఐపీఎల్‌లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసిన శుభ్‌మాన్ గిల్.. చెన్నై బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. 6 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో శుభ్‌మాన్ గిల్ 36 బంతుల్లోనే 57 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

కోల్‌కతా బ్యాటింగ్‌లో స్వల్ప మార్పులు
ఈ మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాటింగ్‌లో స్వల్ప మార్పులు చేసింది. గాయం కారణంగా నితీశ్ రాణా మ్యాచ్‌కు దూరమవడంతో శుభ్‌మాన్ గిల్‌ను నాలుగో స్థానంలో ఆడించింది. ఇప్పటి వరకూ అతన్ని నాలుగు సార్లు ఏడో స్థానంలో, ఒకసారి ఆరు స్థానంలో ఆడించిన సంగతి తెలిసిందే. అండర్-19 వరల్డ్ కప్‌లో క్రికెట్‌లో శుభమాన్ గిల్ వన్‌డౌన్‌లో ఆడేవాడు.

హాఫ్ సెంచరీ సాధించిన రెండో పిన్న వయస్కుడు
తాజాగా బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ రావడంతో ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్న గిల్ ఐపీఎల్‌లో తన తొలి అర్ధ సెంచరీ(57 నాటౌట్) నమోదు చేశాడు. ఐపీఎల్‌లో హాఫ్ సెంచరీ సాధించిన రెండో పిన్న వయస్కుడిగా అరుదైన రికార్డు నెలకొల్పాడు. కోల్‌కతా విజయంలో కీలక పాత్ర పోషించిన గిల్‌పై ట్విటర్ వేదికగా ప్రశంసలు కురుస్తున్నాయి.
శుబ్‌మన్ గిల్ చాలా స్పెషల్
‘ఒక కొత్త స్టార్ జన్మించాడు! శుబ్‌మన్ గిల్ చాలా స్పెషల్.. ఎంతో చక్కగా, శక్తివంతంగా బంతిని బాదాడు' అంటూ ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ట్వీట్ చేశారు.
మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఇలా
‘శుబ్‌మన్ గిల్!!! మరో అండర్ 19 ఆటగాడు ఐపీఎల్‌ను ప్రకాశవంతం చేస్తున్నాడంటూ' ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ప్రశంసలు కురిపించారు.
కోహ్లీ భవిష్యత్ సచిన్ అయితే
‘కోహ్లీ భవిష్యత్ సచిన్ అయితే.. శుబ్‌మన్ గిల్ భవిష్యత్ కోహ్లి అయ్యే సత్తా ఉన్న ఆటగాడు' అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
తొలి అర్ధ సెంచరీ నమోదు చేసిన శుభ్‌మాన్ గిల్
‘నాలుగో స్థానంలో ఆడే అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్న శుభ్‌మాన్ గిల్.. ఐపీఎల్‌లో తన తొలి అర్ధ సెంచరీ నమోదు చేశాడు. ఈ రోజు అతడిదే..' అంటూ సీఎస్‌కే ఆటగాడు రవీంద్ర జడేజా ప్రశంసించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications