డైవ్ చేసి మరీ క్రీజులోకి: బెయిర్ స్టో ఫేక్ రనౌట్‌పై స్టీవ్ స్మిత్ ఇలా!

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో స్టీవ్ స్మిత్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కులు చూపిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ సిరిస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అలాంటి స్మిత్‌ను కట్టడి చేసేందుకు ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో కొత్త ఎత్తుకు తెరలేపారు.
ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో ఓ ఫేక్ రనౌట్ చేసి వార్తల్లో నిలిచాడు. ఈ సిరిస్‌లో ఇంగ్లీషు బౌలర్లకు చుక్కలు చూపించిన స్టీవ్ స్మిత్‌ను ఔట్ చేయాలనే ఉద్దేశంతో బెయిర్ స్టో తన వద్ద బంతి లేకపోయినప్పటికీ నటించాడు. దాంతో రనౌట్ నుంచి తప్పించుకోవాలనే యత్నంలో స్మిత్ డైవ్ కొట్టి మరీ క్రీజులోకి చేరుకున్నాడు.

ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు
దీనిపై రెండో రోజు ఆట ముగిసిన తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు స్మిత్ మాట్లాడుతూ "బెయిర్ స్టో నన్ను ఔట్ చేసినంత పని చేశాడు. నా దుస్తుల్ని మురికి చేశాడు. ఆపై ఏమీ చెప్పలేదు. నిజానికి, నాకు బంతి ఎక్కడకు వెళ్లిందో అనే విషయం కూడా తెలియదు. పరుగు తీయడానికి మాత్రమే సిద్ధమయ్యా. స్టో చేసింది సరైన పని కాదని మాత్రమే చెప్పగలను" అని అన్నాడు.

స్టీవ్ స్మిత్ అద్భుత ప్రదర్శన
ఈ సిరిస్‌లో అసాంతం అద్భుత ప్రదర్శన చేసిన స్టీవ్ స్మిత్ (145 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌తో 80) మరోసారి ఒంటరిపోరాటం చేయడంతో ఓవల్ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 68.5 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 69 పరుగుల ఆధిక్యం లభించింది.
ఆ ముద్ర వద్దనుకున్నా: టెస్టుల్లో ఐదు వికెట్లు తీయడంపై బుమ్రా

ఆరు వికెట్లతో చెలరేగిన జోఫ్రా ఆర్చర్
పేసర్ జోఫ్రా ఆర్చర్ (6/62) విజృంభణతో ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో తడబడింది. ఈ సిరీస్‌లో తొలిసారి తుది జట్టులోకి వచ్చిన ఆల్‌రౌండర్ సామ్ కరన్ (3/46) కూడా రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ సాధించడంతో ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఓ జట్టుపై వరుసగా పదో హాఫ్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు.

రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 9/0
గతంలో ఇంజమామ్ ఇంగ్లండ్‌పైనే 9 హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ జాబితాలో స్మిత్, హక్‌ల తర్వాత స్థానాల్లో వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్లైవ్ లాయిడ్(8, ఇంగ్లండ్‌పై), దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాక్వస్ కల్లిస్(8, పాకిస్తాన్‌పై), శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరా(8, బంగ్లాదేశ్‌పై ) సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు.కాగా, రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 9/0తో నిలిచింది. క్రీజులో బర్న్స్ (4), డెన్లీ (1) ఉన్నారు. అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 294 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ మార్ష్‌కు ఐదు, కమిన్స్‌కు మూడు వికెట్లు పడగొట్టారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications