For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ ముద్ర వద్దనుకున్నా: టెస్టుల్లో ఐదు వికెట్లు తీయడంపై బుమ్రా

Bumrah Rates His Maiden Five wicket Haul In Test Cricket As Personal Favourite
Jasprit Bumrah rates his maiden five-wicket haul in Test cricket as personal favourite

హైదరాబాద్: జస్ప్రీత్ బుమ్రా... ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అగ్రశ్రేణి బౌలర్లలో ఒకడు. భారత జట్టు తరుపున మూడు ఫార్మాట్లలోనూ ప్రధాన పేసర్‌గా కొనసాగుతున్నాడు. కెరీర్‌ ఆరంభంలో అతడు వన్డే స్పెషలిస్ట్‌ బౌలర్‌గా పేరు పడ్డాడు. కానీ టెస్ట్‌ల్లో సత్తా చాటాలన్నది తన అసలు లక్ష్యమని ఓ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న బుమ్రా వెల్లడించాడు.

టెస్టు క్రికెట్లో తనదైన ముద్ర

టెస్టు క్రికెట్లో తనదైన ముద్ర

ఈ సందర్భంలో టెస్టు క్రికెట్లో తనదైన ముద్ర వేయాలనుకున్నానని.. టీ20, వన్డే క్రికెటర్‌గా మిగిలిపోవాలని తాను భావించలేదని బుమ్రా అన్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లోనూ జట్టుని విజేతగా నిలపడంతో తన కల నెరవేరిందని తెలిపాడు. భారత్ తరుపున బుమ్రా ఇప్పటివరకు కేవలం 12 టెస్టులు ఆడి 62 వికెట్లు పడగొట్టాడు.

 బుమ్రా మాట్లాడుతూ

బుమ్రా మాట్లాడుతూ

దీనిని బట్టి అర్థమవుతుంది అతడు ఏ స్థాయిలో చెలరేగాడో. తాజాగా బుమ్రా మాట్లాడుతూ "నా దృష్టిలో టెస్టు క్రికెట్‌ చాలా ముఖ్యమైంది. ఈ ఫార్మాట్లో ఆడాలనే ఎప్పుడూ అనుకునేవాడిని. కేవలం టీ20, వన్డే ఆటగాడిగా ముద్ర పడకూడదని అనుకున్నా. అందుకే టెస్ట్‌ క్రికెట్‌కు ఎంతో ప్రాధాన్యమిచ్చి..అందులో నాదైన మార్క్‌ చూపాలనుకున్నా" అని పేర్కొన్నాడు.

ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్లో క్రమం తప్పకుండా రాణించా

ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్లో క్రమం తప్పకుండా రాణించా

"ఇందులో భాగంగా ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్లో క్రమం తప్పకుండా రాణించా. ఆ ప్రదర్శనను టెస్ట్‌ల్లో చూపాలని అనుకున్నా. సుదీర్ఘ ఫార్మాట్లో నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఇప్పటివరకు 12 టెస్టులే ఆడా. అంతర్జాతీయ అరంగేట్రం చేసి రెండేళ్లు అయిన తర్వాత దక్షిణాఫ్రికాపై తొలి టెస్టు ఆడినప్పుడు కల నిజమైనట్లు అనిపించింది" అని బుమ్రా తెలిపాడు.

తెల్ల జెర్సీతో ఆడడం గర్వంగా

తెల్ల జెర్సీతో ఆడడం గర్వంగా

"తెల్ల జెర్సీతో ఆడడం గర్వంగా అనిపిస్తుంది.ఇక టెస్ట్‌ల్లో జట్టు విజయాల్లో నా పాత్ర కూడా ఉండడం ఎంతో తృప్తినిస్తోంది. అరంగేట్రం చేసిన తొలి సిరీస్‌లోనే ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడం కూడా చాలా సంతోషాన్నిచ్చింది. రంజీ ట్రోఫీలో ఎర్ర బంతితో ఆడిన అనుభవం రాబోయే దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఉపయోగపడనుంది. భారత గడ్డపై టెస్టుల్లో ఆడడం చాలా భిన్నమైన సవాల్‌" అని బుమ్రా చెప్పాడు.

Story first published: Saturday, September 14, 2019, 9:16 [IST]
Other articles published on Sep 14, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+