తెలంగాణలోని క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. రాష్ట్రంలోని ఔత్సాహిక యువ క్రికెటర్ల కోసం వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు హెచ్‌సీఏ సెక్రటరీ దేవ్ రాజ్ ఓ ప్రకటనను విడుదల చేశారు. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని ఉమ్మడి 9 జిల్లాల్లో మే 6 నుంచి జూన్ 5 వరకు ఉచితంగా నిర్వహించనున్నట్టు తెలిపింది.
అండర్ 14, 16, 19 బాల, బాలికల కోసం ఈ సమ్మర్ క్యాంప్‌లు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేసింది. ఆసక్తి గలవారు మే 4(ఆదివారం)లోపు www.hycricket.org వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. హైదరాబాద్‌లో సికింద్రాబాద్, ఫలక్‌నుమా, అంబర్‌పేట్, లాలాపేట్, చార్మినార్, బాలాపూర్, గోల్కొండ, ఏ.ఎస్. రావు నగర్, ఆర్.కె. పురం, ఎల్.బి. నగర్ ప్రాంతాల్లో ఈ శిక్షణ శిభిరాలు నిర్వహించనున్నారు.

జిల్లాల్లో ఎక్కడంటే..?
వరంగల్, భూపాల్‌పల్లి, జనగామ, ములుగు, పరకాల, మహబూబాబాద్, నిజామాబాద్ (అర్బన్, రూరల్), ఆర్మూర్, కామారెడ్డి, మంచిర్యాల, ఆదిలాబాద్, సిర్పూర్, తాండూర్, చెన్నూర్, మహబూబ్‌నగర్, గద్వాల్, జడ్చర్ల, నారాయణపేట్, నాగర్‌కర్నూల్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జహీరాబాద్, గజ్వేల్, ఖమ్మం, కొత్తగూడెం, గౌతంపూర్, పాల్వంచ, కరీంనగర్, గోదావరిఖని, జగిత్యాల, సిరిసిల్ల, వేములవాడ, నల్గొండ, భువనగిరి, నకిరేకల్, సూర్యాపేట్‌లోనూ హెచ్‌సీఏ ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ క్యాంప్స్ జరగనున్నాయి. జిల్లాల్లోని క్రీడాకారులు స్థానిక జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యాలయాల్లో మే 4 వరకు రిజిస్టేషన్ చేసుకోవాలి.