HCA ఔదార్యం.. భారత మాజీ మహిళా క్రికెటర్‌కు ఆర్థిక సాయం!

హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పెద్ద మనసు చాటుకుంది. భారత మహిళల టీమ్ మాజీ ఆల్‌రౌండర్, హైదరాబాద్ ప్లేయర్ స్రవంతి నాయుడుకు సాయం చేసేందుకు హెచ్‌సీఏ ముందుకొచ్చింది. స్రవంతి పేరెంట్స్ ఇద్దరూ కరోనా సోకి వేర్వేరు హాస్పిటల్స్‌లో చేరారు. ఈ విషయం తెలుసుకున్న హెచ్‌సీఏ ఆమెకు తక్షణ సాయంగా రూ.3 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. తన తల్లి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, తండ్రి కూడా ఐసీయూలో ప్రాణాల కోసం పోరాడుతున్నాడని స్రవంతి చెప్పింది. హెల్ప్ చేసేందుకు ముందుకొచ్చిన హెచ్‌సీఏకు ఆమె థ్యాంక్స్ చెప్పింది.
పేరెంట్స్ ట్రీట్‌మెంట్ కోసం స్రవంతి ఇప్పటికే రూ.16 లక్షలు ఖర్చు చేసిందని, ఆమెకు ఆర్థిక సాయం అవసరమని షట్లర్ గుత్తా జ్వాలా ట్వీట్ చేసింది. ఆమెను ఆదుకోవాలని మంత్రి కేటీఆర్‌ను కోరింది. తెలుగు రాష్ట్రాల్లోని కరోనా పేషెంట్స్‌కు హెల్ప్ చేస్తున్న క్రికెటర్ హనుమ విహారి.. స్రవంతి కోసం తమవంతు సాయం చేస్తామని ట్వీట్ చేశాడు.
స్రవంతి నాయుడు భారత్ తరఫున 1 టెస్ట్, 4 వన్డేలు, 6 టీ20లు ఆడింది. మొత్తం 12 వికెట్లు తీసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications