Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

HCA ఎన్నికల బరిలో శివలాల్ యాదవ్ ప్యానెల్!

హైదరాబాద్: హెచ్‌సీఏ(హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) ఎన్నికల బరిలో బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్, టీమిండియా దిగ్గజ ఆటగాడు శివలాల్ యాదవ్ ప్యానెల్ బరిలోకి దిగుతోంది. హర్షద్ అయూబ్‌తో కలిసి శివలాల్ యాదవ్‌ అనచరులు 'క్రికెట్ ఫస్ట్ ' ప్యానెల్ పేరుతో పోటీ చేస్తున్నారు. ఈ ప్యానెల్ నుంచి హెచ్‌సీఏ అధ్యక్షునిగా అమర్ నాథ్ పోటీ చేస్తుండగా.. వైస్ ప్రెసిడెంట్‌గా జీ శ్రీనివాస్ బరిలో నిలిచారు.

ట్రెజరర్‌గా సంజీవ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా చిట్టి శ్రీధర్, కౌలర్‌గా సునీల్ అగర్వాల్ పోటీలో నిలిచారు. నేటితో హెచ్‌సీఏ ఎన్నికల నామినేషన్ల ఉప సంహరణకు గడవు ముగిసిన నేపథ్యంలో 'క్రికెట్ ఫస్ట్' ప్యానెల్ సభ్యులు సోమవారం మీడియాతో మాట్లాడారు. తమను గెలిపిస్తే.. అవినీతిలో కూరుకుపోయిన హెచ్‌సీఏను ప్రక్షాళన చేస్తామని తెలిపారు.

HCA Elections: Shivlal and Ayub panel promises to bring back lost ‘glory of Hyderabad cricket’

ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తున్న అమర్ నాథ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ క్రికెట్‌కు పూర్వ వైభవం తీసుకొస్తామని, అవినీతి, రాజకీయ పలుకుబడి లేకుండా అర్హత కలిగిన క్రికెటర్లకు అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. జిల్లా స్థాయి క్రీడా కారులందరికీ తగిన న్యాయం చేస్తామని, వారికి కావాల్సిన ప్రోత్సహకాలు అందిస్తామన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా స్టేడియాల అభివృద్ధికి కృషి చేయడంతో పాటు నిష్ఫక్షపాతంగా ఆటగాళ్లను ఎంపిక చేస్తామని హామీ ఇచ్చారు. అనుభవం కలిగిన కోచ్‌లను ఏర్పాటు చేసి క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. క్రికెట్‌ను అభివృద్ధి చెయ్యడమే తమ ప్యానెల్ ఎజెండా అని పేర్కొన్నారు.

మరోవైపు యూనైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సీఏ ప్యానెల్ నుంచి హ్యాండ్‌బాల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు అధ్యక్ష పదవి రేసులో నిలిచారు. ఉపాధ్యక్షుడు శ్రీధర్, ప్రధాన కార్యదర్శిగా హరినారయణ, సహాయక కార్యదర్శిగా నోయల్ డేవిడ్, కోశాధికారిగా శ్రీనివాస్, కౌన్సిలర్‌గా హన్సర్ అహ్మద్ ఖాన్ పోటీ చేస్తున్నారు. ఈ ప్యానెల్‌కు అధికారి బీఆర్‌ఎస్ పార్టీ మద్దతు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ నెల 20న ఎన్నికలు జరగనుండగా.. 173 మంది ఓటర్లు హెచ్‌సీఏ పాలన వర్గాన్ని ఎన్నుకోనున్నారు. మాజీ ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్దీన్‌ పోటీ చేయకుండా అనర్హత వేటు వేసారు.

Story first published: Monday, October 16, 2023, 21:45 [IST]
Other articles published on Oct 16, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+