For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

HCA తీరుపై ప్రేక్షకులే కాదు.. రోహిత్ శర్మ కూడా అసంతృప్తి.. కుర్చీల విషయంలో కస్సుమన్న హిట్‌మ్యాన్!

 HCA could not provide a proper seat for Indian cricket captain Rohit Sharma

హైదరాబాద్: భారత్ X ఆస్ట్రేలియా మూడో టీ20 నిర్వహణ విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)పై తీవ్ర విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే. మ్యాచ్ టికెట్ల అమ్మకాల దగ్గర నుంచి మైదానంలో కనీస వసతులు కల్పించడంలోనూ హెచ్‌సీఏ దారుణంగా విఫలమైంది. హెచ్‌సీఏ నిర్లక్ష్యంపై క్రికెట్ అభిమానులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇక సాధారణ ప్రేక్షకులే కాదు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా హెచ్‌సీఏ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. మీడియా సమావేశానికి వచ్చిన రోహిత్ శర్మకు కూడా నిర్వాహకులు సరైన కుర్చీ వేయలేకపోయారు.

సరైన కుర్చీ వేయకపోవడంతో..

రోహిత్‌కు వేసిన చైర్.. ముందు టేబుల్ మీద ఉన్న మైకుల కంటే తక్కువ ఎత్తులో ఉంది. అది అంత సౌకర్యంగా లేకపోవడంతో హెచ్‌సీఏ ప్రతినిధులు మళ్లీ మరో చైర్ తెప్పించారు. అది కూడా అంతే ఉండటంతో రోహిత్ చిర్రెత్తుకుపోయాడు. నిర్వహాకులపై 'క్యా యార్'(ఎందిరా ఈ లొల్లి) అని కస్సుమన్నాడు. హెచ్‌సీఏ గురించి ముందే తెలుసు గనుక ఎలాగోలా అడ్జస్ట్ అయ్యి మీడియా సమావేశాన్ని ముగించాడు. ఈ విషయంపై డెక్కన్ క్రానికల్ ఓ కథనం ప్రచురించడంతో ఈ విషయం వెలుగు చూసింది. దాంతో హెచ్‌సీఏపై హిట్ మ్యాన్ అభిమానులు మండిపడుతున్నారు.

తొక్కిసలాటతో నవ్వుల పాలు..

తొక్కిసలాటతో నవ్వుల పాలు..

మ్యాచ్ నిర్వహణలో భాగంగా జింఖానా గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన టికెట్ కౌంటర్ల విషయంలో హెచ్‌సీఏ పూర్తిగా విఫలమైన విషయం తెలిసిందే. అక్కడ సరైన ఏర్పాట్లు చేయలేకపోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పోలీసులతో పాటు పలువురు అభిమానులు తీవ్రంగా గాయపడ్డారు. అభిమానులను అదుపు చేసే క్రమంలో పోలీసులు లాఠీ చార్జీ కూడా చేశారు.

ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవ్వడంతో హెచ్‌సీఏ నవ్వులపాలైంది. అంతేకాకుండా మైదానంలోని కుర్చీలపై కూడా తీవ్ర ట్రోలింగ్ జరిగింది. కుర్చీల మీద పక్షులు మల విసర్జన, విరిగిపోయి, పాడైపోయి ఉన్న చైర్స్ ఫోటోలు వైరలయ్యాయి. అయితే మ్యాచ్ సమయానికల్లా 'మమ' అనిపించి చేతులు దులుపుకున్న హెచ్‌సీఏ.. రోహిత్ మీడియా సమావేశంలో మాత్రం దొరికిపోయింది.

అధికార పార్టీ నాయకులకు అప్పనంగా టికెట్లు..

అధికార పార్టీ నాయకులకు అప్పనంగా టికెట్లు..

ఇక టికెట్ల కోసం అభిమానులు యుద్దమే చేయగా.. రాజకీయ నాయకులు మాత్రం అప్పనంగా టికెట్లు కొట్టేసారు. తమ అధికారంతో కాంప్లిమెంటరీ పాసులు తెచ్చుకున్నారు. చోటా మోటా నాయకులు సైతం వీఐపీ పాస్‌లతో మ్యాచ్‌ను వీక్షించారు. మంత్రులు సైతం తమ అనుచర గణంతో మ్యాచ్‌కు హాజరయ్యారు.

దాదాపు నగరంలోని అధికారిక కార్పోరేటర్లు, చోటా మోటా నాయకులకు కాంప్లిమెంటరీ పాసులు అందినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో మ్యాచ్‌‌కెళ్లామని వారు పెట్టిన ఫోటోలో ఈ విషయాన్ని దృవీకరిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా హెచ్‌సీఏ వ్యవహారాన్ని చూసి చూడనట్లుగా వదిలేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మళ్లీ అధ్యక్షుడయ్యేందుకు..

మళ్లీ అధ్యక్షుడయ్యేందుకు..

ఉప్పల్ మ్యాచ్‌కు ముందు.. నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌లో హెచ్‌సీఏ క్లబ్ మెంబర్స్‌‌కు 'మందు పార్టీ' ఇచ్చాడు. ఇప్పటికే హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఆయన పదవీకాలం ముగిసిన నేపథ్యంలో ఆయన వచ్చే ఎన్నికల్లో కూడా మళ్లీ అధ్యక్ష పీఠమెక్కడానికి ఉవ్విళ్లూరుతున్నాడు. ఇందులో భాగంగానే హెచ్‌సీఏ కార్యదర్శులకు ఏకంగా రూ. 30 లక్షలు ఖర్చు చేసి మందు పార్టీ ఏర్పాటు చేశాడు. ఆహ్వన పత్రికలు పంపి మరీ మందు పార్టీకి రావాలని క్లబ్ మెంబర్స్‌ను కోరాడు. మళ్లీ అధ్యక్ష పదవి అందుకోవాలనే ఆశతోనే అజార్ 12 వేల టికెట్లు పక్కదారి పట్టించి బ్లాక్‌లో అమ్మాడని కొందరు క్లబ్ మెంబర్స్ ఆరోపిస్తున్నారు.

Story first published: Tuesday, September 27, 2022, 17:09 [IST]
Other articles published on Sep 27, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+