Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Syed Mushtaq Ali Trophy: ఉప్పల్‌లో టీ20 మ్యాచ్‌లు.. ఫ్రీ ఎంట్రీ!

ప్రతిష్టాత్మక దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా హైదరాబాద్‌, ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం‌లో గ్రూప్-సీ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు పూర్తి కాగా.. మరో 10 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్‌లు చూసేందుకు ప్రేక్షకులకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఫ్రీ ఎంట్రీ కల్పించింది. ఈ అవకాశాన్ని క్రికెట్ అభిమానులు ఉపయోగించుకోవాలని హెచ్‌సీఏ పేర్కొంది.

ఫ్రీగా మ్యాచ్‌లు చూడాలనుకునేవారు గేట్ నెంబర్ 3 నుంచి స్టేడియంలోకి ఉచితంగా వెళ్లవచ్చు. నవంబర్ 26న ఈ టోర్నీ ప్రారంభం కాగా.. ఉప్పల్ స్టేడియం వేదికగా నాలుగు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఈ టోర్నీలో దేశవాళీతో పాటు వెటరన్ స్టార్ క్రికెటర్లు బరిలోకి దిగుతున్నారు. బరోడా తరఫున హార్దిక్ పాండ్యా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. అతన్ని చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కుతుంది.

ఉప్పల్‌లో నవంబర్ 30, డిసెంబర్ 2, డిసెంబర్ 4, డిసెంబర్ 6, డిసెంబర్ 8 తేదీల్లో రెండేసి మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుండగా.. రెండో మ్యాచ్‌ సాయంత్ర 4.30కు మొదలవ్వనుంది.

HCA Announces Free Entry for Syed Mushtaq Ali Trophy 2025 Matches at Uppal Stadium

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గ్రూప్ సీ మ్యాచ్‌ల వివరాలు

నవంబర్ 30

తొలి మ్యాచ్: గుజరాత్ X హర్యానా

రెండో మ్యాచ్: గుజరాత్ X హర్యానా

డిసెంబర్ 2

తొలి మ్యాచ్: బరోడా X పంజాబ్

రెండో మ్యాచ్: హర్యానా X సర్వీసెస్

డిసెంబర్ 4

తొలి మ్యాచ్: బెంగాల్ X సర్వీసెస్

రెండో మ్యాచ్: పుదుచ్చేరి X పంజాబ్

డిసెంబర్ 6

తొలి మ్యాచ్: గుజరాత్ X హిమాచల్ ప్రదేశ్

రెండో మ్యాచ్: పంజాబ్ X సర్వీసెస్

డిసెంబర్ 8

తొలి మ్యాచ్: బెంగాల్ X హర్యానా

రెండో మ్యాచ్: హిమాచల్ ప్రదేశ్ X పుదుచ్చేరి

Story first published: Friday, November 28, 2025, 16:21 [IST]
Other articles published on Nov 28, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+