న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అచ్చం ధోనీలానే రిషభ్ పంత్ హెలికాప్టర్ షాట్.. నెట్టింట వైరల్!

Have you seen Rishabh Pant pulls off MS Dhonis helicopter shot upon return to outdoor training

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)2020 సీజన్ కోసం టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ తెగ కష్టపడుతున్నాడు. దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తుండటంతో పంత్ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశాడు. వెటరన్ క్రికెటర్ సురేశ్ రైనాతో కలిసి గుర్‌గ్రామ్‌లో అతనికి సంబంధించిన మైదానంలో చెమటోడ్చుతున్నాడు. కరోనా కారణంగా మూడు నెలలు ఇంటికే పరిమితమైన పంత్.. ఫిట్‌నెస్‌లో పూర్వ వైభవం అందుకోవడానికి పరితపిస్తున్నాడు. ఈ ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా భాగంగా స్పిన్నర్ విసిరిన బంతిని హెలికాప్టర్ షాట్ రూపంలో పంత్ సిక్స్‌గా తరలించాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది.

హెలికాప్టర్ షాట్ పితామహుడు..

హెలికాప్టర్ షాట్ పితామహుడు..

ఇక హెలికాప్టర్ షాట్ పితామహుడు మహేంద్రసింగ్ ధోనీలానే ఆడిన ఈ షాట్ అందరిని ఆకట్టుకుంటుంది. దశాబ్దన్నర క్రితం ఈ హెలికాప్టర్ షాట్‌ను ధోనీ క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేయగా.. పదుల సంఖ్యలో క్రికెటర్లు అతడ్ని అనుకరించే ప్రయత్నం చేశారు. కానీ ఓ నలుగురు ఐదుగురు మాత్రమే ధోనీ తరహాలో ఆ షాట్‌ను ఆడగలుగుతున్నారు. వారిలో భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ముందు వరుసలో ఉండగా.. అఫ్గానిస్థాన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్‌ మాక్స్‌వెల్ రెగ్యులర్‌గా హెలికాప్టర్ షాట్‌ ఆడుతుంటారు. ఊహించని బ్రేక్‌తో మరిచిపోయినట్టు అయిన ఈ షాట్‌ను పంత్ మరింత ప్రాక్టీస్ చేస్తున్నాడు. ముఖ్యంగా యార్కర్ బంతులను సిక్స్‌లుగా మలిచేందుకు సులువుగా ఉండేందుకు ధోనీ ఈ తరహా టెక్నిక్‌ను ఉపయోగించేవాడు. పూర్తిగా భుజబలంతో చాలా మోటుగా ఉండే ఈ షాట్ అభిమానులకు విపరీతంగా నచ్చింది.

రీ ఎంట్రీ కోసం..

భారత్ జట్టులోకి 2017లో ఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్.. జూనియర్ ధోనీ‌గా అందరి నుంచి కితాబులు అందుకున్నాడు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియాకు ధోనీ దూరమవగా.. ఈ ఏడాది జనవరి వరకూ అతని స్థానంలో రిషబ్ పంత్‌కి టీమిండియా మేనేజ్‌మెంట్ అవకాశమిచ్చింది. కానీ.. వన్డే, టీ20ల్లో ఘోరంగా విఫలమైన పంత్.. తన స్థానాన్ని కేఎల్ రాహుల్‌కి చేజార్చుకున్నాడు. అతను అద్బుతంగా రాణించడంతో పంత్ పూర్తిగా బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ 2020 సీజన్‌లో రాణించి.. మళ్లీ ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్ భారత జట్టులో చోటు దక్కించుకోవాలని పంత్ ఆశిస్తున్నాడు.

బద్దకం పెరిగింది..

బద్దకం పెరిగింది..

మూడు నెలల సుదీర్ఘ విరామంతో బద్దకం పెరిగిపోయిందని, అయితే తిరిగి ప్రాక్టీస్ చేయడం చాలా ఆనందంగా ఉందని పంత్ తెలిపాడు. 'ఇన్ని రోజులు ఇంట్లో ఉండడం వల్ల ప్రాక్టీస్‌లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కానీ రైనాతో కలిసి ప్రాక్టీస్ చేయడం వల్ల వాటిని అధిగమించగలుగుతున్నా. ఆటకు సంబంధించి ఎన్నో టిప్స్ రైనా నేర్పిస్తున్నాడు. మేము ఎన్నో విషయాలపై చర్చించుకుంటున్నాం. దాంతో నాకు తెలియని విషయాలెన్నో నేర్చుకొగలుగుతున్నా. అంతేకాకుండా త్వరలోనే బీసీసీఐ టీమ్‌ను ఎంపిక చేయనుంది. ఆ జట్టుకు ఎంపికవ్వాలంటే కఠోర సాధన అవసరం. ఈరోజు కాకపోతే రేపైనా శ్రమించాల్సిందే. అందుకే శరీరం ఎంత మొరాయిస్తున్నా ప్రాక్టీస్‌ను కొనసాగిస్తున్నా'అని పంత్ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, July 30, 2020, 14:40 [IST]
Other articles published on Jul 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X