మన్కడింగ్‌పై పాంటింగ్‌తో సంభాషణ ఆసక్తికరంగా సాగింది.. ఏం మాట్లాడానంటే..?: అశ్విన్

దుబాయ్: 'మన్కడింగ్'పై ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్‌తో ఆసక్తికరంగా సంభాషించానని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. పాంటింగ్ దుబాయ్ చేరుకోగానే.. అతనితో ముఖాముఖి చర్చిస్తానని పేర్కొన్నాడు. అయితే టెలిఫోన్ సంభాషణలో మేం మాట్లాడుకున్నారో మరో వారం రోజుల్లో చెబుతానని అన్నాడు. ఇక సమయం దొరికినప్పుడల్లా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా దుబాయ్ విశేషాలను అభిమానులతో పంచుకుంటానని అశ్విన్ పేర్కొన్నాడు.

సంభాషణ ఆసక్తికరంగా సాగింది:
తాజాగా రవిచంద్రన్ అశ్విన్ పోడ్‌కాస్ట్ షోలో మాట్లాడుతూ.... 'రికీ పాంటింగ్ ఇంకా దుబాయ్ చేరుకోలేదు. రాగానే అతనితో ముఖాముఖి చర్చిస్తా. నాతో సంభాషించాలని ఆయన కూడా అన్నారు. ఇప్పటికే మేం ఫోన్లో మాట్లాడుకున్నాం. చాలా ఆసక్తికరంగా మా సంభాషణ సాగింది. మరింత స్పష్టత కోసం రికీతో నేరుగా మాట్లాడతా' అని చెప్పాడు. అంతర్జాతీయ కెరీర్‌లో అశ్విన్ ఇప్పటివరకు 71 టెస్టుల్లో, 111 వన్డేల్లో, 46 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

ఏం మాట్లాడానో వచ్చేవారం చెబుతా:
ఆస్ట్రేలియన్ ఇంగ్లిష్ యాస కాస్త భిన్నంగా ఉంటుందని రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నాడు. 'ఆస్ట్రేలియన్ ఇంగ్లిష్ యాస కాస్త భిన్నంగా ఉంటుంది. కొన్నిసార్లు ఆస్ట్రేలియన్ ఇంగ్లిష్‌ను తర్జుమా చేసినప్పుడు వేరే అర్థంతో సందేశం మనకు అందుతుంది. అందుకే అప్పుడప్పుడు వారి జోకులు కూడా పెద్ద పెద్ద వార్తలవుతాయి. రికీతో ఏం మాట్లాడానో వచ్చేవారం మీకు కచ్చితంగా చెబుతా' అని ఆర్ అశ్విన్ తెలిపాడు. మన్కడింగ్‌పై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ముగిసిపోయిన అధ్యాయాన్ని పాంటింగ్ ముందరేయడంతో.. క్రికెట్ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది.

బట్లర్ అసహనం:
గతేడాది కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు సారథ్యం వహించిన ఆర్ అశ్విన్ ట్రేడాఫ్‌లో ఈ సారి ఢిల్లీ క్యాపిటల్స్‌కు బదిలీ అయ్యాడు. చివరి సీజన్‌లో బంతి వేయకముందే సగం పిచ్ దాటేసిన రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్‌ను మన్కడింగ్ రూపంలో ఔట్ చేశాడు. మైదానంలోనే బట్లర్ దీనిపై అసహనం వ్యక్తం చేశాడు. ఇక టోర్నీ మొత్తం అదే చర్చ నడిచింది. దీనిపై అప్పట్లో పెద్ద వివాదమే చెలరేగింది. క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని కొందరు, నిబంధనల ప్రకారమే సరేనని మరికొందరు వాదించారు.

మన్కడింగ్ చేసేందుకు అంగీకరించను:
ఆర్ అశ్విన్ ఈ సారి డిల్లీకి బదిలీకావడంతో అతడు మన్కడింగ్ చేసేందుకు అంగీకరించనని ఆ జట్టు కోచ్ రికీ పాంటింగ్ ఇటీవలే అన్నాడు. దీంతో ఈ సీజన్ ఆరంభం కాకముందే మన్కడింగ్‌పై చర్చ జరుగుతోంది. ఐసీసీ నిబంధనల ప్రకారమే ఉంది కాబట్టి దీనిని అంగీకరిస్తానని కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ అన్నాడు. మొత్తానికి రికీతో ఈ విషయంపై మాట్లాడుతా అని అశ్విన్ అన్నాడు. అంతేకాదు.. బౌలర్ నోబాల్ విసిరినప్పుడు బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఫ్రీహిట్ ఇస్తున్నారని, అలాగే బ్యాటర్ క్రీజు దాటినప్పుడు ఆ జట్టు స్కోరులో 5 పరుగులు తగ్గించాలని, ఫ్రీబాల్ ఇవ్వాలని అశ్విన్ సూచించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
'మాజీ క్రికెటర్లూ.. యూట్యూబ్ ఛానెల్‌లను నడపవద్దు'