Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Hashmatullah Shahidi: ఆ తప్పిదమే మా కొంపముంచింది

చెన్నై: చెత్త ఫీల్డింగే తమ ఓటమిని శాసించిందని అఫ్గానిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది తెలిపాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ 149 పరుగుల భారీ తేడాతో చిత్తయ్యింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఘోర పరాజయంపై స్పందించిన హష్మతుల్లా సునాయస క్యాచ్‌లు నేలపాలు చేయడంతో పాటు.. చివరి 6 ఓవర్లలో ధారళంగా పరుగులివ్వడం తమ విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు.

'ఈ స్థాయి క్రికెట్‌లో ఎలాంటి క్యాచ్‌లు అయిన అందుకోవాలి. మా ఫీల్డింగ్ మరి దారుణం. చెత్త ఫీల్డింగ్ కారణంగానే ఈ మ్యాచ్‌లో మేం వెనుకపడ్డాం. చివరి 6 ఓవర్లలో కూడా ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. 40వ ఓవర్ ముందుకు మేం కీలక క్యాచ్‌లు నేలపాలు చేశాం. సెటిల్ అయిన బ్యాటర్లను అడ్డుకోలేకపోయాం.

Hashmatullah Shahidi says The fielding was poor After New Zealand beat Afghanistan by 149-run

మేం విజయం కోసం ఎంతో ప్రయత్నించాం. కానీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాం. టాస్ గెలిచినంత మాత్రానా విజయం అందుకోలేం. పిచ్‌ను సరిగ్గా అంచనా వేయంలేం. ఈ పిచ్ చాలా నెమ్మదిగా ఉంది. మేం అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ చెత్త ఫీల్డింగ్ మా కొంపముంచింది. తీరని నష్టం చేసింది. మాకు ఇంకా ఆడాల్సిన మ్యాచ్‌లు ఉన్నాయి.

ఎక్కడ మెరుగు పడాలనే అంశంపై చర్చిస్తాం. తదుపరి మ్యాచ్‌లో నేలకు కొట్టిన బంతిలా బలంగా తిరిగి పుంజుకుంటాం.'అని హష్మతుల్లా చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 288 పరుగులు చేసింది. కెప్టెన్ టామ్ లాథమ్(74 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68), గ్లేన్ ఫిలిప్స్(80 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 71), విల్ యంగ్( 64 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.

అఫ్గాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఓమర్జాయి, నవీన్ ఉల్ హక్ రెండేసి వికెట్లు తీయగా.. ముజీబ్ ఉర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన అఫ్గానిస్థాన్ 34.4 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలి ఘోర పరాభావాన్ని మూటగట్టుకుంది. రెహ్మత్ షా(36), అజ్మతుల్లా ఓమార్జాయ్(27) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్(3/39), లాకీ ఫెర్గూసన్(3/19) తీన్మార్ వేయగా.. ట్రెండ్ బౌల్ట్ రెండు వికెట్లతో సత్తా చాటాడు. మ్యాట్ హెన్రీ, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీసారు.

Story first published: Wednesday, October 18, 2023, 22:53 [IST]
Other articles published on Oct 18, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+