For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: అఫ్గాన్ కెప్టెన్

న్యూఢిల్లీ: బ్యాటింగ్ వైఫల్యమే టీమిండియా చేతిలో తమ ఓటమిని శాసించిందని అఫ్గానిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది తెలిపాడు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన హష్మతుల్లా షాహిది వరుసగా వికెట్లు కోల్పోవడమే తమ పరాజయానికి కారణమైందన్నాడు. 300 ప్లస్ లక్ష్యాన్ని నమోదు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు.

'భీకర బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత్‌ను దృష్టిలో పెట్టుకొని 300 ప్లస్ పరుగుల లక్ష్యాన్ని నమోదు చేయాలనుకున్నాం. దురదృష్టవశాత్తు వరుసగా వికెట్లు కోల్పోవడంతో అది సాధ్యం కాలేదు. పిచ్ మాత్రం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. దాంతో భారీ లక్ష్యం నమోదు చేసి భారత్‌‌పై ఒత్తిడి తేవాలనుకున్నాం. కానీ వరుసగా వికెట్లు కోల్పోవడంతో అనుకున్న లక్ష్యాన్ని నమోదు చేయలేకపోయాం.

Hashmatullah Shahidi says Back-to-back wickets was the reason after India Beat Afghanistan in WC 2023

ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత అజ్మతుల్లాతో కలిసి భాగస్వామ్యం నెలకొల్పడంపై నేను ఫోకస్ పెట్టాను. డాట్స్ బాల్స్‌కు గురించి దిగులు పడాల్సిన అవసరం లేదని అతనికి చెప్పా. క్రీజులో సెట్ అయిన తర్వాత డాట్ బాల్స్ లెక్క సరిచేద్దామన్నాను. కీలక భాగస్వామ్యం నమోదు చేయడమే మన లక్ష్యామని చెప్పాను. ఈ టోర్నీలో మాకు ఇంకా ఏడు మ్యాచ్‌లు ఉన్నాయి. తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని మిగిలిన మ్యాచ్‌ల్లో రాణించేందుకు కృషి చేస్తాం.'అని హష్మతుల్లా షాహిది చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 8 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. కెప్టెన్ హష్మతుల్లా షాహిది(88 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 80), అజ్మతుల్లా ఓమర్జీ(69 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 62) టాప్ స్కోరర్లుగా నిలిచారు. జస్‌ప్రీత్ బుమ్రా(4/34) నాలుగు వికెట్లతో అఫ్గానిస్థాన్ పతనాన్ని శాసించాడు.

హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీయగా... శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్‌కు తలో వికెట్ దక్కింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్.. 35 ఓవర్లలో 2 వికెట్లకు 273 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ రోహిత్ శర్మ(84 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్స్‌లతో 131) శతక్కొట్టగా.. విరాట్ కోహ్లీ(56 బంతుల్లో 6 ఫోర్లతో 55 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. అఫ్గాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ ఒక్కడే రెండు వికెట్లు తీసాడు.

Story first published: Wednesday, October 11, 2023, 22:11 [IST]
Other articles published on Oct 11, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+