Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AFG: నా తప్పిదం వల్లే ఈ ఓటమి: అఫ్గానిస్థాన్ కెప్టెన్

బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని అఫ్గానిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ అన్నాడు. వరుసగా వికెట్లు కోల్పోయామని, అందులో తన తప్పిదం కూడా ఉందని అంగీకరించాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత్ 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

నా నుంచే తప్పులు..

ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన హష్మతుల్లా ఈ ఓటమి తమకు ఓ గుణపాఠమని తెలిపాడు. 'ఇది మాకు చాలా కష్టమైన మ్యాచ్. వరుసగా వికెట్లు కోల్పోవడమే మా ఓటమికి ప్రధాన కారణం. రెహ్మానుల్లా గుర్బాజ్ ఆడుతున్నప్పుడు మేం 220-230 పరుగులు చేస్తే అది మంచి టార్గెట్ అవుతుందని భావించాను. కానీ మేం వెంట వెంటనే వికెట్లు కోల్పోయాం. దాంతో 30 పరుగులు తక్కువగా చేశాం.

Hashmatullah Shahidi Blames Middle-Order Collapse for Afghanistan Defeat Against India In 1st ODI

లెఫ్టార్మ్ స్పిన్నర్‌ను టార్గెట్ చేయాలని నేను అనుకున్నా. ఎందుకుంటే ఆవైపు బౌండరీ లైన్ కూడా కొంచెం చిన్నగా ఉంది. గుర్బాజ్ అద్భుతంగా ఆడాడు. కానీ ఆ తర్వాత మేం కొన్ని తప్పులు చేశాం. నా నుంచే ఆ తప్పులు మొదలయ్యాయి. ఆ తర్వాత ఇతర బ్యాటర్లు కూడా తప్పులు చేశారు. అందుకే మేం 30 పరుగులు తక్కువ చేశాం.

ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. మా బౌలింగ్‌లో కూడా క్రమశిక్షణ లోపించింది. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని తదుపరి మ్యాచ్‌లో మెరుగ్గా రాణించే ప్రయత్నం చేస్తాం.'హష్మతుల్లా షాహిదీ చెప్పుకొచ్చాడు.

IND vs AFG: శుభ్‌మన్ గిల్ ఘోర తప్పిదం.. అర్ష్‌దీప్ సింగ్ అసహనం!

IND vs AFG: శుభ్‌మన్ గిల్ ఘోర తప్పిదం.. అర్ష్‌దీప్ సింగ్ అసహనం!

గుర్బాజ్ శతకం వృథా..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. రెహ్మానుల్లా గుర్బాజ్(51 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లతో 102) శతకంతో చెలరేగగా.. కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ(27), అజ్మతుల్లా ఒమర్జాయ్(26) డబుల్ డిజిట్ స్కోర్ చేశారు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌ స్కోర్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్(3/27), హర్ష్ దూబే(3/47) మూడేసి వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి(2/31) రెండేసి వికెట్లు పడగొట్టారు.

అనంతరం భారత్ 22.5 ఓవర్లలో 3 వికెట్లకు 195 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(66 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 84 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. ఇషాన్ కిషన్(22 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 34), కేఎల్ రాహుల్(19 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. అఫ్గాన్ బౌలర్లలో జియూర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీసారు. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

IPL 2027: కావ్య మారన్ కీలక నిర్ణయం.. అతనిపై వేటు!

IPL 2027: కావ్య మారన్ కీలక నిర్ణయం.. అతనిపై వేటు!
Story first published: Saturday, June 13, 2026, 23:02 [IST]
Other articles published on Jun 13, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+