IND vs AFG: మా ఓటమికి కారణం అదే: అఫ్గాన్ కెప్టెన్
టెస్ట్ క్రికెట్‌లో ఆడిన అనుభవం లేకపోవడంతోనే ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నామని అఫ్గానిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ అన్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించిందని అభినందనలు తెలిపాడు. మానవ్ సుతార్ అద్భుతమైన బౌలింగ్‌కు చేతులెత్తేసామని, పిచ్ కూడా మారిందని, స్కోర్ బోర్డు ఒత్తిడి కూడా తమ పతనాన్ని శాసించిందని చెప్పాడు.
ముల్లాన్‌పూర్ వేదికగా సోమవారం ముగిసిన ఏకైక టెస్ట్‌లో భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల భారీ తేడాతో అఫ్గాన్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన హష్మతుల్లా..ఓడినా సానుకూల అంశాలు ఉన్నాయని చెప్పాడు.
కంగ్రాట్స్ ఇండియా..
'భారత్‌కు నా అభినందనలు. ఇది మాకు ఒక కఠినమైన రోజు. కఠినమైన మ్యాచ్. మ్యాచ్ ఆరంభం నుంచే మేం వెనుకపడ్డాం. మా బౌలింగ్‌లో క్రమశిక్షణ లేదు. ఆరంభం నుంచే భారత్ ఆధిపత్యం చెలాయించింది. నిజం చెప్పాలంటే.. మాకు ఈ ఫార్మాట్‌లో అంతగా అనుభవం లేదు. ఈ మ్యాచ్ నుంచి మేం చాలా నేర్చుకున్నాం.

ఎందుకంటే మాకు ఈ ఫార్మాట్ ఆడేందుకు తగినన్ని అవకాశాలు లభించవు. కానీ తమ సొంత పరిస్థితులలో ఆడేటప్పుడు ఇండియా చాలా కఠినమైన జట్టు అని అందరికీ తెలుసు. అయితే మాకు చాలా పాఠాలు లభించాయి. ఈ ఓటమి నుంచి మేము నేర్చుకుంటాం. పరిస్థితులు మరింత కఠినంగా మారినప్పుడు.. ఒత్తిడిలో ఎలా ఆడాలో ఈ మ్యాచ్ మాకు నేర్పించింది.
మానవ్ సూతర్ బౌలింగ్ అద్భుతం..
ఈ మ్యాచ్‌లో ఓడినా మాకు కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా సలీమ్ అద్భుతంగా రాణించాడు. గాయం నుంచి కోలుకొని రీఎంట్రీలోనే సత్తా చాటాడు. అలాగే బ్యాటింగ్‌లో రహమత్ తొలి ఇన్నింగ్స్‌లో చాలా బాగా ఆడాడు. రెండో ఇన్నింగ్స్‌లో సెదిక్ పర్వాలేదనిపించాడు.
మానవ్ సుతార్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతను స్టంప్-టు-స్టంప్ లైన్‌లో బౌలింగ్ చేశాడు. చాలా క్రమశిక్షణతో బౌలింగ్ చేయడంతో అతన్ని ఎదుర్కోనేందుకు మేం ఇబ్బంది పడ్డాం. పిచ్ ప్రవర్తన కూడా సెషన్ సెషన్ మారుతూ వచ్చింది. స్కోర్ బోర్డ్ ఒత్తిడి కూడా మా ఓటమిని శాసించింది. మానవ్ సుతార్ మాత్రం చాలా క్రమశిక్షణతో బౌలింగ్ చేశాడు.'అని హష్మతుల్లా షాహిదీ చెప్పుకొచ్చాడు.
సంక్లిప్త స్కోర్లు
భారత్ తొలి ఇన్నింగ్స్ 564/8 డిక్లెర్డ్ (శుభ్‌మన్ గిల్ 126, కేఎల్ రాహుల్ 100)
అఫ్గానిస్థాన్ తొలి ఇన్నింగ్స్ 152 ఆలౌట్( రెహ్మాత్ షా 60, మానవ్ సుతార్ 6/33)
అఫ్గానిస్థాన్ రెండో ఇన్నింగ్స్ 112 ఆలౌట్ (సెదిఖుల్లా అటల్ 42, వాషింగ్టన్ సుందర్ (4/36), కుల్దీప్ యాదవ్(3/30)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

