Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అఫ్గాన్ క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం..

Hashmatullah Shahidi Becomes First Afghan Player To Score Test Double Century

అబుదాబి: హస్మతుల్లా షహీదీ అఫ్ఘనిస్తాన్‌ క్రికెట్‌ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. జింబాబ్వేతో జరుగుతోన్న రెండో టెస్టులో అజేయ డబుల్‌ సెంచరీ (443 బంతుల్లో 21 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 200 నాటౌట్‌ ) సాధించడం ద్వారా అఫ్ఘనిస్తాన్‌ తరఫున టెస్టుల్లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. అతనితో పాటు కెప్టెన్‌ అస్గర్‌ అఫ్గాన్‌(257 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 164) సెంచరీ బాదడంతో అఫ్గాన్ భారీ స్కోర్ చేసింది.

ఓవర్‌నైట్‌ స్కోరు 307/3తో రెండో రోజు ఆట కొనసాగించిన అఫ్ఘనిస్తాన్‌ తమ తొలి ఇన్నింగ్స్‌ను 4 వికెట్లకు 545 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. హస్మతుల్లా, అస్గర్‌ నాలుగో వికెట్‌కు 307 పరుగులు జోడించారు. 276 బంతుల్లో సెంచరీ సాధించిన అతడు..మరో 167 బంతుల్లో ద్విశతకాన్ని అందుకున్నాడు. అస్గర్‌ వెనుదిరిగినా.. జమాల్‌ (55) తోడుగా హస్మతుల్లా భారీస్కోరు అందించాడు. టెస్టుల్లో అఫ్గాన్‌కు ఒక ఇన్నింగ్స్‌లో ఇదే అత్యధిక స్కోరు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే గురువారం ఆట ముగిసే సమయానికి తమ తొలి ఇన్నింగ్స్‌లో 17 ఓవర్లలో వికెట్‌నష్టపోకుండా 50 పరుగులు చేసింది.

Story first published: Friday, March 12, 2021, 11:25 [IST]
Other articles published on Mar 12, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+