Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మ్యాచ్‌ను మలుపు తిప్పిన కొత్తబంతి.. దక్షిణాఫ్రికా‌ ఢమాల్! 18 ఏళ్ల త‌ర్వాత సిరీస్ గెలిచిన పాక్‌!

Hasan Ali, Shaheen Afridi shine Pakistan beat South Africa in 2nd Test

రావ‌ల్పిండి: పాకిస్థాన్ గడ్డపై దశాబ్దం తర్వాత పర్యటిస్తున్న దక్షిణాఫ్రికా జట్టు టెస్టుల్లో పూర్తిగా తేలిపోయింది. రెండో టెస్టులో ఓ దశలో విజయం ఖాయం అనుకున్న దశ నుంచి అనూహ్యంగా ఓటమిపాలైంది. రావల్పిండిలో సోమవారం ముగిసిన రెండో టెస్టులో 370 పరుగుల ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా.. 274 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో పాకిస్తాన్ 95 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుని.. రెండు టెస్టుల సి‌రీస్‌ని క్లీన్‌స్వీప్ చేసింది. స‌ఫారీ టీమ్‌పై పాక్ సిరీస్ గెల‌వ‌డం 18 ఏళ్ల‌లో ఇదే తొలిసారి కావ‌డం విశేషం. హ‌స‌న్ అలీకి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్', మొహ్మద్ రిజ్వాన్‌కు 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డులు దక్కాయి.

ఆదుకున్న మర్‌క్రమ్, బవుమా

ఆదుకున్న మర్‌క్రమ్, బవుమా

370 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్ డీన్ ఎల్గర్ (17) విఫలమయినా.. మరో ఓపెనర్ ఎయిడెడ్ మర్‌క్రమ్ (108: 243 బంతుల్లో 13x4, 3x6) సెంచరీ చేశాడు. వాండరర్ దుస్సేన్ (48) అండగా నిలిచాడు. దుస్సేన్, డుప్లెసిస్ (5) కొద్ది వ్యవధిలోనే పెవిలియన్ చేరినా.. అప్పటికి ప్రొటీస్ పోటీలోనే ఉంది. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ తెంబ బవుమా (61: 125 బంతుల్లో 6x4) మర్‌క్రమ్‌కు అండగా నిలిచాడు.

మ్యాచ్‌ను మలుపు తిప్పిన కొత్తబంతి

మ్యాచ్‌ను మలుపు తిప్పిన కొత్తబంతి

3 వికెట్ల‌కు 241 ప‌రుగుల‌తో దక్షిణాఫ్రికా మ్యాచ్ గెలిచేలానే క‌నిపించింది. అయితే ఈ స‌మ‌యంలో పాకిస్తాన్ కొత్త బంతి తీసుకోవ‌డంతో మ్యాచ్ మొత్తం మలుపు తిరిగింది. పేస్ బౌల‌ర్లు ష‌హీన్ అఫ్రిది (4/51), హ‌స‌న్ అలీ (5/60) రెండో కొత్త బాల్‌తో చెల‌రేగ‌డంతో.. చివ‌రి రోజు అద్భుతం చేద్దామ‌నుకున్న దక్షిణాఫ్రికా ఆశ‌లు నెర‌వేర‌లేదు. ఈ ఇద్దరి దాటికి మర్‌క్రమ్‌, బవుమా సహా వచ్చినవారు వచ్చినట్టే పెవిలియన్ బాట పట్టారు. దక్షిణాఫ్రికా కేవ‌లం 33 ప‌రుగుల వ్య‌వ‌ధిలో చివ‌రి 7 వికెట్లను కోల్పోయింది. దీంతో పాకిస్తాన్ 95 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.

అలీకి 10 వికెట్లు

అలీకి 10 వికెట్లు

పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 272 పరుగులు చేయగా.. దక్షిణాఫ్రికా 201 పరుగులకే ఆలౌట్ అయింది. రిజ్వాన్ (115: 204 బంతుల్లో 15x4) శతకం బాదడంతో పాక్ రెండో ఇన్నింగ్స్‌‌లో 298 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 71 పరుగుల్ని కలుపుకుని మొత్తం 370 పరుగుల టార్గెట్ దక్షిణాఫ్రికా ముందు నిలిచింది. రెండో టెస్టులో పాకిస్థాన్ బౌలర్ హసన్ అలీ 10 వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టగా.. తొలి ఇన్నింగ్స్‌లోనూ ఐదు వికెట్లు తీశాడు. కెరీర్‌లో 10 వికెట్ల మార్క్‌ని హసన్ అలీ అందుకోవడం ఇదే తొలిసారి. ఈ విజ‌యంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో పాక్ ఐదో స్థానానికి దూసుకెళ్లింది. 2017 త‌ర్వాత పాక్ ఇంత పైకిరావ‌డం ఇదే తొలిసారి.

స్వీట్ వార్నింగ్

స్వీట్ వార్నింగ్

రెండో టెస్టులో ఆదివారం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లక్ష్య ఛేదనలో భాగంగా దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తుండగా.. ఎవరూ ఊహించని విధంగా మైదానం‌లోకి ఓ నల్ల పిల్లి వచ్చింది. దాంతో అంపైర్లు మ్యాచ్‌ని కాసేపు నిలిపివేశారు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మాజీ కెప్టెన్ అజహర్ అలీ.. ఆ పిల్లి వెంబడించి బౌండరీ లైన్ వెలుపలికి తరిమేశాడు. అదే సమయంలో అలీ‌కి వికెట్‌ కీపర్‌ మహ్మద్ రిజ్వాన్ ఓ స్వీట్ వార్నింగ్ ఇస్తూ కనిపించాడు.

India vs England: రోహిత్ ఔట్.. టీమిండియా 39/1! గెలవాలంటే ఇంకా 381 కొట్టాలి!!

Story first published: Monday, February 8, 2021, 18:56 [IST]
Other articles published on Feb 8, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+