Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Harshit Rana: మా కోసం ఆయన రాజకీయాలనే వదులుకున్నాడు: కిస్సింగ్ స్టార్ (వీడియో)

కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) మెంటార్ గౌతమ్ గంభీర్‌పై ఆ జట్టు యువ పేసర్ హర్షిత్ రాణా ప్రశంసల జల్లు కురిపించాడు. కేకేఆర్ కోసం గంభీర్ తన రాజకీయ జీవితాన్ని వదులుకున్నాడని తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్‌‌కు ముందు కేకేఆర్ మెంటార్‌గా బాధ్యతలు చేపట్టిన గంభీర్.. తన మార్గదర్శకంలో జట్టను ఛాంపియన్‌గా నిలబెట్టాడు.

2019లో బీజేపీ అభ్యర్థిగా ఈస్ట్ ఢిల్లీ పార్లమెంట్ స్థానం నుంచి గంభీర్ ఎంపీగా ఎన్నికయ్యాడు. 2024 సార్వత్రిక ఎన్నిక ముందు కేకేఆర్ మెంటార్‌గా బాధ్యతలు చేపట్టడంతో రాజకీయాల నుంచి తప్పుకున్నాడు. తన ఫోకస్‌ను పూర్తిగా కేకేఆర్‌పై పెట్టాడు.

Harshit Rana says Gautam Gambhir s sacrifices his political career to help KKR win IPL 2024

తాజాగా ఓ పోడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న హర్షిత్ రాణా.. గంభీర్ త్యాగం గురించి మాట్లాడుతూ ప్రశంసల జల్లు కురిపించాడు. 'కేకేఆర్ కోసం గంభీర్ భాయ్ రాజకీయాలను వదులుకున్నాడు. కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టేందుకు రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. కేకేఆర్ కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేశాడు.'అని చెప్పుకొచ్చాడు.

మహేంద్ర సింగ్ ధోనీ‌పై ఉన్న ప్రేమతో సొంత అభిమానులు కూడా తమకు మద్దతు తెలుపలేదని, సీఎస్‌కే ఆడిన ప్రతీ మ్యాచ్ పసుపు మయం అయ్యిందని హర్షిత్ రాణా గుర్తు చేసుకున్నాడు. 'మహేంద్ర సింగ్ ధోనీ భాయ్‌కి ప్రతీ మైదానం హోమ్ గ్రౌండే. అతను అడుగుపెడితే మైదానాలన్నీ పసుపుమయం అయ్యాయి. అతను గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు అభిమానుల అరుపులతో చెవులు గిల్లుమంటాయి.'అని తెలిపాడు.

ఐపీఎల్ 2024 సీజన్‌లో ఆర్‌సీబీ అద్భుత ప్రదర్శన కనబర్చిందని కొనియాడిన హర్షిత్ రాణా.. దురదృష్టవశాత్తు టోర్నీ నుంచి నిష్క్రమించిందని చెప్పుకొచ్చాడు. 'ఆర్‌సీబీకి అదృష్టం లేదు. వాళ్లు అద్భుతమైన క్రికెట్ ఆడారు. కానీ వారికి అదృష్టం కలిసి రాలేదు.'అని హర్షిత్ రాణా తెలిపాడు.

ఐపీఎల్ 2024 సీజన్‌లో హర్షిత్ రాణా అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 13 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే అతని సెలెబ్రేషన్స్ తీవ్ర వివాదాస్పదమయ్యాయి. వికెట్ తీసిన అనంతరం ప్రత్యర్థి ఆటగాళ్లకు ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. తొలి మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్‌ ఔట్ చేసిన ఆనందంలో అతనికి దగ్గరగా వెళ్లి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమవ్వగా.. మ్యాచ్ ఫీజులో కోత విధిస్తూ ఐపీఎల్ నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు.

మరో మ్యాచ్‌లోనూ ఇలానే ఫ్లయింగ్ కిస్ ఇవ్వడంతో పాటు బ్యాటర్ పట్ల దురుసుగా ప్రవర్తించడంతో హర్షిత్ రాణాపై ఓ మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించారు. కేకేఆర్ టైటిల్ గెలిచిన అనంతరం ఆ జట్టు ఓనర్ షారుఖ్ ఖాన్ సైతం ఫ్లయింగ్ కిస్ సెలెబ్రేషన్స్‌తో హర్షిత్ రాణాను మెచ్చుకున్నాడు. దాంతోనే రాణాకు నెటిజన్లు కిస్సింగ్ స్టార్‌గా పేరు పెట్టారు.

Story first published: Monday, June 17, 2024, 18:00 [IST]
Other articles published on Jun 17, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+