న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Harshal Patel vs Riyan Parag మధ్య గొడవ.. యువ ప్లేయర్‌పై దూసుకెళ్లిన ఆర్‌సీబీ బౌలర్! (వీడియో)

Harshal Patel vs Riyan Parag: Gets Into Dirty Fight In IPL 2022 Video Goes Viral

పుణే: ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ రియాన్ పరాగ్ తొలి హాఫ్ సెంచరీ అందుకున్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో టాపార్డర్, మిడిలార్డర్, లోయరార్డర్ విఫలమైన వేళ.. అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. జోష్ హజెల్ వుడ్, హర్షల్ పటేల్ వేసిన చివరి ఓవర్లలో చూడచక్కని షాట్లతో పరుగులు పిండుకున్న రియాన్ పరాగ్ సిక్సర్‌తో ఇన్నింగ్స్ ముగించాడు. సిక్సర్ బాదిన ఆనందంలో ఏదో అన్న రియాన్ పరాగ్‌తో ఆఖరి ఓవర్ వేసిన హర్షల్ పటేల్ వాగ్వాదానికి దిగాడు.


ఎందుకు అంత అత్యుత్సాహం అంటూ అతనిపైకి దూసుకెళ్లాడు. రియాన్ పరాగ్ సైతం ధీటుగా బదులివ్వడంతో చిన్నపాటి ఘర్షణ వాతావరణం నెలకొంది. హర్షల్‌కు సిరాజ్ సైతం జత కాగా.. మైదానంలోకి వచ్చిన రాజస్థాన్ రాయల్స్ సపోర్ట్ స్టాఫ్ వారిని వారించాడు. అయితే అక్కడ ఏం జరిగిందనేదానిపై క్లారిటీ లేకపోయినప్పటికీ.. సిక్సర్ కొట్టాడనే అసహనంతోనే హర్షల్ పటేల్‌ అతనితో వాగ్వాదానికి దిగాడని కొదరంటుంటే.. రియాన్ పరాగ్ నోరు జారడంతోనే హర్షల్ రియాక్ట్ అయ్యాడని మరికొందరూ అంటున్నారు. మొత్తానికి ఈ ఫైట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక రియాన్ పరాగ్ ఇన్నింగ్స్ పట్ల నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆటతోనే విమర్శకులకు బదులిచ్చాడని విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 144 పరుగులు చేసింది. రియాన్ పరాగ్(31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. హర్షల్ పటేల్ వేసిన చివరి ఓవర్‌లో రెండు సిక్స్‌లు, ఫోర్‌తో 18 పరుగులు పిండుకున్నాడు. రియాన్ పరాగ్‌ తర్వాత సంజూ శాంసన్(27) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆర్‌సీబీ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, వానిందు హసరంగ, హజెల్ వుడ్ రెండేసి వికెట్లు తీయగా.. హర్షల్ పటేల్ ఓ వికెట్ పడగొట్టాడు.

Story first published: Tuesday, April 26, 2022, 22:31 [IST]
Other articles published on Apr 26, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X