
32 వికెట్లతో..
ఐపీఎల్ 2021 సీజన్ ముందు ట్రేడింగ్ ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఆర్‌సీబీలోకి వచ్చిన హర్షల్ పటేల్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఏకంగా 32 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ఈ సూపర్ పెర్ఫామెన్స్‌తో టీమిండియా పిలుపును అందుకున్న అతను న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై జరగిన టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. రెండు మ్యాచ్‌ల్లో నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. మెగా వేలం నేపథ్యంలో ఆర్‌సీబీ విరాట్ కోహ్లీ, గ్లేన్ మ్యాక్స్‌వెల్, మహమ్మద్ సిరాజ్‌లను మాత్రమే రిటైన్ చేసుకుంది. తమ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన హర్షల్ పటేల్‌ను రిటైన్ చేసుకోకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. తాజాగా క్రిక్‌ట్రాకర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్షల్ పటేల్ తనను తీసుకోకపోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు.

పర్స్‌మేనేజ్‌మెంట్‌లో భాగంగానే..
'నన్ను రిటైన్ చేసుకోలేదని తెలిసిన వెంటనే ఆర్‌సీబీ డైరెక్టర్ మైక్ హెస్సన్ ఫోన్ చేశాడు. పర్స్ మేనేజ్‌మెంట్‌లో భాగంగానే రిటైన్ చేసుకోలేకపోయామని చెప్పాడు. నన్ను జట్టులో తీసుకునేందుకు ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ ఆతృతగా ఉంది. నేను కూడా ఆ జట్టు తరఫున ఆడేందుకు ఇష్టపడుతున్నా. ఎందుకంటే ఆర్‌సీబీ, ఐపీఎల్ 2021 సీజన్ వల్ల నా కెరీర్, జీవితం మొత్తం మారిపోయింది. ఇక వేలం నేపథ్యంలో ఏ ఫ్రాంచైజీ నన్ను ఇప్పటి వరకు సంప్రదించలేదు.

ఆర్‌సీబీ వల్లే..
ఐపీఎల్ 2021 సీజన్ ముందు ఎప్పుడూ డెత్ ఓవర్స్‌లో బౌలింగ్ చేయలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఆర్‌సీబీకి ట్రేడ్ అయినప్పుడు.. హోమ్ వర్క్‌లో భాగంగా నా స్కిల్స్‌ను గుర్తించారు. నేను గుడ్ డెత్ బౌలర్‌గా భావించి.. ఆ బాధ్యతలు నాకు అప్పజెప్పారు. అలా నేను డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అయ్యా. ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు.

జడేజా బాదిన ఓవర్..
ఇక ఐపీఎల్ 2021 సీజన్‌లో నా బౌలింగ్‌ను జడేజా చితక్కొట్టడంతో ఏ మాత్రం బాధపడలేదు. కెరీర్ ప్రారంభంలో అలా జరిగితే బాధపడేవాడినేమో కానీ. 11 ఏళ్లు ప్రొఫెషనల్ క్రికెట్‌లో ఇలాంటి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నా. వీటిని సీరియస్‌గా తీసుకున్నా.. సస్టైన్ కావడం కష్టం. ఆ ఓవర్‌లో నేను తప్పిదాలు చేశాను. ప్రణాళిక బద్దంగా బౌలింగ్ చేయలేకపోయాను. బ్యాటర్‌కు అది మంచి రోజు. అతనికి మాములు రోజు అయితే ఒకటి రెండు మిస్సయ్యేవి. కానీ నాకు అదో దుర్దినం. ఒక్క సింగిల్ యార్కర్ కూడా ఎక్స్‌క్యూట్ చేయలేకపోయా.


Click it and Unblock the Notifications












